పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుందా? అయితే..
పొట్ట చుట్టూ కొవ్వు పెరగడాన్ని బెల్లీ ఆఫ్ సెంట్రల్ ఒబెసిటీ అంటారు.
మనకు కనపడినంతవరకు సాధారణంగా ఉండే వ్యక్తులు కూడా కొద్దిరోజుల వ్యవధిలోనే బాగా లావై కనపడటం చూస్తుంటాం. అతి తక్కువ కాలంలోనే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుండటాన్ని మనం గమనిస్తుంటాం. బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం చేస్తుండేవారిలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

చాలా ప్రమాదానికి దారితీస్తుంది
నడుముచుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా.. అందం కూడా చెడిపోతుంది. ఫలితంగా ఎక్కువమందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తద్వారా అనేక మానసిక సమస్యలకు కారణం అవుతోంది. పొట్ట చుట్టూ కొవ్వు వల్ల గుండెపోటు, మధుమేహం, కొన్నిరకాల క్యాన్సర్లు, జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి. కొంతమందిలో బరువు పెరగకుండా పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుండటాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.

12 గంటలపాటు ఆహారానికి దూరం
పొట్ట చుట్టూ కొవ్వు పెరగడాన్ని బెల్లీ ఆఫ్ సెంట్రల్ ఒబెసిటీ అంటారు. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ పెరగడంవల్ల బాడీమాస్ ఇండెక్స్ 30 లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతుంది. పొట్ట చుట్టూ చేరిన కొవ్వు వల్ల ఊపిరి తిత్తులకు శ్వాసించే శక్తిని తగ్గిస్తాయి. 12 గంటలపాటు ఆహారానికి దూరంగా ఉండాలి. శరీరానికి తగిన విధంగా వ్యాయామం చేయడంవల్ల ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీసీ, షుగరు, థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటుండాలి.

వ్యక్తుల ఎత్తును బట్టి వ్యాయామం
వ్యక్తుల ఎత్తు, బరువును బట్టి వ్యాయామాలు చేస్తుండటం, శ్వాస వ్యాయామాలు చేస్తుండటం, 3 కిలోమీటర్లు వాకింగ్ చేయడం, ఉప్పును తగ్గించుకోవడం, తగినంత నిద్ర పోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో రెండు రకాల కొవ్వులుంటాయని, వాటిలో విసరల్ ఫ్యాట్ అనే కొవ్వురకం ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు చేరేవారిలో విసరల్ ఎక్కువగా ఉంటుందని. వీటిని నియంత్రించాలని, లేదంటే.. గుండె జబ్బులకు, టైప్2 మధుమేహం, అల్జీమర్స్, రక్తపోటు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంని వైద్యులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications