కొలెస్ట్రాల్..సైలెంట్ కిల్లర్ - ఈ గింజలతో కంట్రోల్​ లో..!!

కొలెస్ట్రాల్. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఎన్నో ప్రాణాంతక రుగ్మతలకు కారణం. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పటికీ అంత తొందరగా మనకు అర్థం కాదు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే గుండె తో పాటుగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో కనిపించే లక్షణాలే అధిక కొలెస్ట్రాల్ కు సూచికలు. అయితే,
కూరగాయలు, విత్తనాలతో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చని నివేదికలు స్పష్టం చేస్తు న్నాయి. జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకొనే అవకాశం ఉంది.

రక్తంలో కొలెస్ట్రాల్ అనే మైనపు లాంటి పదార్థం. శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కణాలను నిర్మించడానికి, విటమిన్ డి, హార్మోన్లను తయారు చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి హానికరం. అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో ప్లాక్ ఏర్పడి గుండె జబ్బులకు, స్ట్రోక్​కు కారణంగా ఉంటుంది.

almonds-and-other-tree-nuts-can-improve-blood-cholesterol-as-reports

అధిక కొలెస్ట్రాల్ ఉంటే సహజంగా ఛాతీ నొప్పి, కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి, చర్మ మార్పులు, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాపు, గుండె స్పందనలో మార్పు, దవడలో నొప్పి,మెడ వెనుక భాగంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 2 డయా బెటిస్, ఒబెసిటీ వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాగా, డయాబెటిస్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని, ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిల ను పెంచుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే శాచురేటెడ్ కొవ్వులు తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాక్టరీల్లో ప్రాసెస్ చేసిన మాంసాలు, శుద్ధి చేసిన పిండిపదార్థాలతో సమస్యలు వస్తాయి. అలాగే, సముద్రపు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయని, ఇవి గుండెకు, రక్తనాళాలకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వాటిని బాగా వేపితే నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాల్లో పండ్లు, కూరగాయలు, గింజలు ముందు వరుసలో ఉంటాయని, ఇవి శాచురేటెడ్ కొవ్వులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సోయా బాగా ఉపయోగపడుతుంది. తాజా కూర గాయలు, పండ్లు వాడటంతో పాటు జొన్న, రాగి, అవిసె గింజల వంటి ఆరోగ్యకరమైన తృణ ధాన్యాలు తీసుకుంటే, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహార నియమాలకు తోడుగా యోగా, నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటివి కూడా కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచడంలో మేలు చేస్తాయని వివరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+