ఆంధ్రా స్పెషల్ 'తోటకూర మజ్జిగ పులుసు'.. ఎలా తయారు చేసుకోవాలి..?
మజ్జిగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు మాదిరిగానే మజ్జిగలోనూ ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో సాయపడతాయి. ఇక తోటకూర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండింటి కాంబినేషన్ లో తోటకూర మజ్జిగ పులుసు తయారు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆంధ్రా స్పెషల్ 'తోటకూర మజ్జిగ పులుసు'.. ఎలా తయారు చేసుకోవాలి..? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నది తెలుసుకుందాం..
తోటకూర మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. తోటకూర 2 లేదా 3 కట్టలు
పెరుగు హాఫ్ కేజీ, పచ్చిమిర్చి 3, కరివేపాకు, అల్లం తగినంత, నూనె రెండు స్పూన్ లు, ఉప్పు సరిపడా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి 5 లేదా 5 రెబ్బలు, పచ్చిశనగపప్పు టీ స్పూన్, మినప్పప్పు టీ స్పూన్, మెంతులు తగినన్ని, ఎండుమిర్చి 2 లేదా 3, పసుపు తగినంత తీసుకోవాలి.
ఇక తయారీ విధానం చూస్తే.. ముందుగా తోటకూరను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్నగా తరుక్కోవాలి. ఇక అల్లం వెల్లున్ని పేస్టును కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టుకుని తగినంత నూనె పోసి వేడెక్కనివ్వాలి. అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న తోటకూరను, అలాగే పచ్చిమిర్చి, పసుపు, అల్లం పేస్టు వేసి వేపుకోవాలి. కొద్దిసేపటికి తోటకూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు వేసి బాగా చిలకాలి. అందులోనే ఉప్పు, పావు లీటరు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అందులోనే చల్లార్చుకున్న తోటకూర వేసి మిక్స్ చేసుకోవాలి. దాంతో ఘుమఘుమలాడే తోటకూర మజ్జిగ పులుసు రెడీ అయినట్లే..
-
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!! -
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications