మునక్కాయ కూర పాలు పోసి వండండి.. వదిలిపెట్టలేరు నమ్మండి!
ఎండాకాలం వస్తుందంటేనే మునక్కాయలు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో ఎక్కువగా మునక్కాయలు వస్తాయి కాబట్టి మునక్కాయ లను రకరకాలుగా మనం కూరగా వండుకోవచ్చు. మునక్కాయ మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే కూరగాయ. అటువంటి మునక్కాయలు పాలు పోసి కూరగా వండితే అద్భుతంగా ఉంటాయి. దీని రుచి అమోఘంగా ఉంటుంది. ప్రస్తుతం మనం పాలు పోసి మునక్కాయ కూర ఏవిధంగా వండాలో తెలుసుకుందాం.
మునక్కాయ కూర వండడానికి కావలసిన పదార్థాలు
మునక్కాయలు- మూడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి
ఉల్లిపాయలు- మూడు ముక్కలుగా కట్ చేసుకున్నవి
పచ్చిమిరపకాయలు- మూడు కట్ చేసి పెట్టుకున్నవి
నూనె- రెండు స్పూన్లు
పోపు గింజలు - ఒక స్పూన్
పసుపు- అర స్పూన్
ఉప్పు- ఒకటిన్నర స్పూన్
కారం- ఒకటిన్నర స్పూన్
పాలు- ఓ చిన్న గ్లాసుడు

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని, పాన్ వేడి అయిన తర్వాత అందులో నూనె వేసుకోవాలి. నూనె కూడా కాగిన తర్వాత అందులో పోపు గింజలు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి.
ఇలా వండితే మునక్కాయ కూర చాలా రుచిగా ఉంటుంది
ఆ తర్వాత అర స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూను ఉప్పు, ఒకటిన్నర స్పూన్ కారం వేసి బాగా మగ్గనివ్వాలి. మునక్కాయ ముక్క కూడా ఉడికింది అని నిర్ధారించుకున్న తర్వాత, అందులో ఒక గ్లాసుడు పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత ఒక రెండు, మూడు నిమిషాలకి కూరను ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన మునక్కాయ పాలు పోసి వండిన కూర రెడీ అయిపోతుంది ఈ కూర అన్నంలోకి కాదు చపాతీల్లోకి కూడా బాగుంటుంది . ఇంకెందుకు ఆలస్యం ఈ సీజన్లో ఒకసారి పాలు పోసి మునక్కాయ కర్రీని ట్రై చేయండి.












Click it and Unblock the Notifications