ABC జ్యూస్ తీసుకోండి... ఆగకుండా పరిగెత్తుతారు!

మనిషి ఆరోగ్యంగా ఉండటానికి అనేక పోషక పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. దీనివల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే శరీరానికి పోషకాలు అందవో అప్పుడు శారీరకంగా, మానసికంగా బలహీనపడతారు. అందుకే పోషకాహార నిపుణులు, ఆరోగ్య నిపుణులు కచ్చితంగా పండ్లు, కాయగూరల్లాంటివి నిత్యం తీసుకోవాలని చెబుతుంటారు. ప్రధానంగా ఏబీసీ జ్యూస్ అనేది ఒకటుంది. దీన్ని తీసుకుంటే చాలు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్ రూట్, సి అంటే క్యారెట్. వీటిని కలిపి తీసుకునే రసం శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా వ్యాధులను నిరోధిస్తుంది.

కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
క్యారెట్‌లో విటమిన్ A ఎక్కువగా ఉంటుంది. ఇది కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి, దృష్టి శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బీట్ రూట్‌లో అధికంగా ఉండే ఫోలేట్, ఐరన్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి, రక్తంలో ఎర్ర కణాలు పెరగడం ద్వారా శక్తిని పెంచుతుంది. బీట్ రూట్, క్యారెట్ జ్యూస్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ హార్ట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మంచిగా పనిచేయడానికి సహాయపడుతుంది. జలుబు, అల్సర్ వంటి సమస్యల నుండి రక్షిస్తుంది.

apple carrot beetroot juice uses in telugu

శక్తి పెరిగి అలసట తగ్గుతుంది
క్యారెట్, బీట్ రూట్‌లో ఉన్న విటమిన్ C చర్మాన్ని మెరుగుపరచటానికి, ఒత్తిడి, చర్మ జ్వరాలు తగ్గించటానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్‌లో ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాల వల్ల శక్తి స్థాయిలు పెరిగి, అలసట తగ్గుతుంది. బీట్ రూట్ జ్యూస్‌లోని ఫైబర్, క్యారెట్ జ్యూస్‌లోని కెలొరీలు తక్కువగా ఉండటం వలన, బరువు తగ్గడం , అధిక కొవ్వు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన శరీరంలో నీటి లోపాన్ని (డీహైడ్రేషన్) నివారిస్తుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడానికి, డిటాక్సిఫై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. యాపిల్, క్యారెట్, బీట్ రూట్ కలిపి రసం పరగడుపున తీసుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు అనంతం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+