వేరుశెనగలను ఎక్కువగా తింటున్నారా? అయితే మీ కాలేయం డేంజర్‌లో పడ్డట్లే!

వేరుశెనగలు (Peanuts) పోషకాలు, రుచిలో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఇవి మంచి కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉండటంతో పౌష్టికాహారంగా పరిగణించబడతాయి. అయితే, అధిక మోతాదులో వాటి వినియోగం ఆరోగ్యంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపవచ్చు. ముఖ్యంగా వాటిలో కాలేయానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

వేరుశెనగల పోషక విలువలు:
వేరుశెనగలలో అధికంగా ఉండే ప్రోటీన్ శరీరానికి పుష్టిని అందిస్తుంది. దీనిలోని మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (MUFA) హృదయానికి మేలు చేసే కొవ్వులుగా పరిగణించబడతాయి. విటమిన్ B, E, మాంగనీస్, మెగ్నీషియం వంటి వాటితో సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

Are you eating too many peanuts But your liver is in danger

వేరుశెనగలు- కాలేయం:
వేరుశెనగలలో "అఫ్లాటాక్సిన్స్" అనే విషపూరిత పదార్ధాలు ఉంటాయి. ఇవి కొన్ని రకాల బూజు (Aspergillus flavus) ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. వేరుశెనగలను నిల్వ చేసే పరిస్థితులు సరిగా లేనప్పుడు ఈ బూజు పెరిగే అవకాశం ఉంది. అఫ్లాటాక్సిన్స్ కాలేయానికి హాని చేస్తాయి.

అధికంగా వేరుశెనగలు తింటే కలిగే నష్టాలు:
కాలేయ క్యాన్సర్: అఫ్లాటాక్సిన్స్ కాలేయ క్యాన్సర్ కు ముఖ్య కారణాలలో ఒకటి. అధికంగా వేరుశెనగలు తినడం ద్వారా శరీరంలో అఫ్లాటాక్సిన్స్ స్థాయి పెరిగుతుంది. ఇది కాలేయ కణజాలాన్ని దెబ్బతీసి కాలేయ కేన్సర్‌కు కారణమవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

కాలేయ వాపు (Hepatitis): అఫ్లాటాక్సిన్స్ కాలేయంలో వాపును కలిగిస్తాయి, దీని వలన కాలేయ పనితీరు దెబ్బతింటుంది. అంతే కాకుండా దీర్ఘకాలం పాటు అఫ్లాటాక్సిన్స్ శరీరంలో ఉండటం వలన కాలేయ కణాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది.

కాలేయంపై ప్రభావం: వేరుశెనగలు సహజంగా అధిక కొవ్వు శాతం కలిగి ఉంటాయి. శరీరంలో కొవ్వు అధికమైతే కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. కొవ్వు కాలేయ వ్యాధి (Fatty Liver Disease) అనే సమస్యకు కారణమవుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, ఇది సాధారణంగా ఒక వ్యక్తి ఎక్కువ నూనెపదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలతో పాటు అధిక మోతాదులో వేరుశెనగలు తినడం వల్ల జరుగుతుంది.

కొవ్వు అధికం కావడం: అధికంగా వేరుశెనగలు తింటే శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరవచ్చు, ఇది కాలేయానికి తోడ్పడకపోగా హాని చేస్తుంది. వేరుశెనగలు అధిక క్యాలరీలతో ఉండటంతో, నియంత్రణ లేకుండా తినడం వల్ల బరువు పెరగడం సాధారణం. ఇది కాలేయం ఆరోగ్యంలో ప్రతికూలతను కలిగిస్తుంది.

నిపుణుల సూచనలు: వేరుశెనగలను మితంగా తినాలి. రోజుకు ఒక గుప్పెడు వేరుశెనగలు తినడం ఆరోగ్యానికి మంచిది. నాణ్యమైన వేరుశెనగలను మాత్రమే కొనాలి. ప్యాకెట్ మీద ఎటువంటి బూజు లేదా రంగు మారిన గుర్తులు లేవని చూసుకోవాలి. వేరుశెనగలను చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. కాలేయ సమస్యలు ఉన్నవారు వేరుశెనగలను తినకపోవడం మంచిది. మీకు వేరుశెనగల వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వేరుశెనగలు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కలిగినప్పటికీ, మితిమీరిన వినియోగం వల్ల సమస్యలు కలగవచ్చు. ముఖ్యంగా కాలేయ ఆరోగ్యం కాపాడుకోవాలంటే, మితమైన పరిమితిలో వీటిని తీసుకోవడం, ఆహారపు నియమాలను పాటించడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. అందుకే, ఏ ఆహారాన్ని అయినా సమతులంగా తినడమే ఆరోగ్యకరమైన జీవనశైలికి మూలం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+