తక్కువ ఖర్చుతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇలా!

రాజ్యాన్ని పరిపాలించే రాజులకు వారి రాజరికం ప్రకారం తలపై కిరీటాలు పెట్టుకుంటారు. అయితే సామాన్యులకు ఏం కిరీటం ఉంది? అని ప్రశ్నించుకుంటే భగవంతుడు మనిషికి తలపై కిరీటం పెట్టాడు. అదే జుట్టు. అందరికీ ఉంటుంది. ఆ కిరీటాన్ని చూసుకొని మనిషి మురిసిపోతాడు. స్త్రీ అయితే రకరకాలుగా ముడులు వేసుకుంటుంది. మనిషికి తన ముఖం అందంగా కనపడాలంటే తలపై జుట్టు కూడా ఉండాలి. అందుకే దానికి అంత ప్రాధాన్యతనిస్తారు. అయితే మారుతున్న జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లతోపాటు జన్యుపరంగా చాలామందికి చిన్నతనంలోనే బట్టతల వస్తోంది. దీంతో కొందరు విగ్ లు పెట్టుకొని తిరుగుతుంటే మరికొందరు ఖర్చు ఎక్కువైనప్పటికీ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు.

ఈ పద్ధతి వచ్చిన మొదట్లో ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమేణా ప్లాంటేషన్ చేయించుకునే ఖర్చు తగ్గుతూ వస్తోంది. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలంటే ఏమేం పరిశీలించాలో తెలుసుకుందాం.

At experienced doctors Hair Transplantation at low cost

మెట్రో నగరాలలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
క్లినిక్ ప్రతిష్ట: ప్రసిద్ధ క్లినిక్‌లు ఎక్కువ డబ్బులు అడుగుతాయి.
డాక్టర్ అనుభవం: అనుభవజ్ఞులైన వైద్యులు ఎక్కువ ఫీజు వసూలు చేస్తారు.
సాంకేతికత: అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించే క్లినిక్‌లు ఎక్కువ ఖర్చు చేస్తాయి.
మార్పిడి చేయబడిన గ్రాఫ్ట్‌ల సంఖ్య: ఎక్కువ గ్రాఫ్ట్‌లవల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది.

తక్కువ ఖర్చుతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
వివిధ క్లినిక్‌లు అందిస్తున్న ప్యాకేజీలను, ఫలితాలను పరిశీలించాలి.
ఆఫ్-సీజన్‌లో: ఆఫ్-సీజన్‌లో డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల కొన్ని క్లినిక్‌లు రాయితీలిస్తాయి.
ప్యాకేజీలు: కొన్ని క్లినిక్‌లు ప్యాకేజీలను అందిస్తాయి.
మెడికల్ టూరిజం: ఇతర దేశాలలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తక్కువ ఖర్చుతో చేయించుకోవచ్చు.
ఫైనాన్సింగ్ ఆప్షన్‌లు: కొన్ని క్లినిక్‌లు ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను అందిస్తాయి.

అయితే ఒక్కోసారి తక్కువ ఖర్చుతో చేయించుకున్న హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అందుకే అనుభవజ్ఞులైన వైద్యుల వద్ద చేయించుకోవాలి. వారిదగ్గర నెలవారీ చెల్లించే పద్దతి ఉందేమో తెలుసుకోండి. మీకు ఏరకంగా కావాలో ముందుగా వైద్యుడితో మాట్లాడాలి. అలాగే మీ స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటే వారినుంచి వివరాలు తెలుసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+