ఈ అలవాట్లతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్.. అలెర్ట్

ప్రస్తుత సమాజంలో చాలామంది కొలెస్ట్రాల్ బారినపడి ఇబ్బంది పడుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అసలు కారణాలేమిటి? ఎందువల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతుంది అనేది తెలుసుకుందాం. మన రోజువారి అలవాట్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతున్నాయి.

ఫాస్ట్ ఫుడ్ వినియోగంతో చెడు కొలెస్ట్రాల్

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఫాస్ట్ ఫుడ్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ప్రజల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతూ, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఎందుకంటే అనేక నగరవాసులు ఇంట్లో వండిన ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ఆహారాల్లో తరచుగా ఎక్కువ మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు ఎల్‌డిఎల్ (LDL) కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి.

Bad cholesterol in the body due to these habits Alert

వీటితో చెడు కొలెస్ట్రాల్

దీన్నే సాధారణంగా చెడు కొలెస్ట్రాల్‌గా పిలుస్తారు. ఎల్‌డిఎల్ స్థాయిలు పెరిగితే గుండె జబ్బులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. అంతేకాదు డీప్ ఫ్రై చేసిన ఆహారాలతో కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇక ధూమపానం చేసే వారిలోనూ మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మద్యం సేవించే వారిలో కూడా ట్రై గ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ సమస్యలు ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్

ఎక్కువగా నిద్ర పోని వారిలోనూ, నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొనే వారిలోను చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొనే వారిలో శరీరంలో కార్టిసాల్ అని చెడు హార్మోన్ ను పెంచుతుంది. ఇక స్వీట్లు తినే వారిలోనూ, శీతల పానీయాలు తాగే వారిలోనూ, కేక్స్ వంటి చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకునే వారిలోనూ చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది.

రోజంతా కూర్చున్నా, ఈ పని చేయకున్నా చెడు కొలెస్ట్రాల్

డయాబెటిస్ బాధితులకు చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. రోజంతా కూర్చోవడం, ఏమాత్రం వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారణాలు కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఇక చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి గల కారణాలను గుర్తించి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+