అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!!

అరటిపండ్లను ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే పండుగా పరిగణిస్తారు. మనిషి ఆరోగ్యానికి సంబంధించి మార్కెట్‌లో అత్యంత చౌకగా లభించే పండు ఏదైనా ఉందంటే.. అది అరటిపండే. అలాంటి అరటి పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పుడైనా నిరసంగా అనిపిస్తే.. ఆ వెంటనే ఒక అరటి పండు తీసుకోవడం వల్ల కొన్ని సెకన్లలోనే శరీరానికి శక్తి అందినట్లు అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అయితే అరటిపండ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతూ.. గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే ఇందులోని మెగ్నీషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఆకలిగా అనిపించినప్పుడు, జంక్ ఫుడ్ కు బదులుగా అరటిపండ్లు తినడం మంచి ఎంపికగా చెబుతున్నారు. అయితే.. అలెర్జీ, మధుమేహం, మూత్ర పిండాల సమస్యలు, ఉబ్బసం, జీర్ణ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అరటి పండ్లకు దూరంగా ఉండటం.. లేదా పరిమితంగా తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారితోపాటు డైట్ ఫాలో అయ్యేవారు అరటిపండ్లకు దూరంగా ఉండటం మంచిది.

bananas-are-high-in-fiber-and-resistant-starch-improved-colon-health-increased-feeling-of-fullness

ఈ లక్షణాలు ఉంటే అరటిపండ్లకు దూరంగా ఉండాల్సిందే

అరటిపండ్లను అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇక షుగర్ వ్యాధిగ్రస్తులకు అరటి పండ్లు చాలా హానికరం. ఎందుకంటే వీటిలో సహజంగా చక్కెర ఉంటుంది. అలాగే ఉబ్బరం, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అరటి పండ్లను తీసుకోకపోవడం మంచిది. అలాగే ఖాళీ కడుపుతో అరటి పండ్లు తినడం వల్ల శరీరంలో పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల వికారం లేదా వాంతులవుతాయి. దీంతో ఖాళీ కడుపుతో అరటి పండ్లు తీసుకోకూడదు. ఇక మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారు సైతం అరటి పండ్లు తినకపోవడం మంచిది. వాటిలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో ఈ సమస్యతో ఇబ్బంది పడే వారు అరటి పండ్లు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+