మటన్, చికెన్ తిన్న తర్వాత వీటిని తీసుకుంటున్నారా? జాగ్రత్త!

చాలామంది ఎక్కువగా నాన్ వెజ్ ను ఇష్టపడుతూ ఉంటారు. తరచూ మటన్, చికెన్ తింటూ ఉంటారు. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. రకరకాల వంటకాలను చేసి నాన్ వెజ్ ను ఇష్టంగా తినేవారు మాంసాహారం తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మాంసాహారం తిన్నాక ఏ ఆహారాలను అసలు తీసుకోకూడదు?
మటన్, చికెన్ తిన్న తర్వాత ఎటువంటి ఆహారాలను అసలు తీసుకోకూడదు? తీసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పొరపాటున కూడా తేనెను తీసుకోకూడదు. మటన్, చికెన్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇదే సమయంలో తేనె కూడా ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. దీని కారణంగా చర్మ సమస్యలు, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల తేనెను అవాయిడ్ చేయండి.

Be careful with these foods after eating mutton and chicken

టీ తాగడం
చాలామంది నాన్ వెజ్ ఆహారం తిన్న తర్వాత టీ తాగుతారు. మటన్ తిన్న వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. టీలో టానిన్స్ అనే పదార్థం మాంసాహారంలోని ప్రోటీన్ లతో కలిసి జీవక్రియను అడ్డుకుంటుంది. దీంతో అజీర్ణం, గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కనుక నాన్ వెజ్ ఆహారం తిన్న తర్వాత టీ కి దూరంగా ఉండాలి.

పాలు తాగడం
చాలామంది నాన్ వెజ్ తిన్న తర్వాత తెలియక పాలు తాగుతారు. అయితే నాన్ వెజ్ తిన్న తర్వాత పాలు తాగడం మంచిది కాదు. ఈ రెండు భిన్న లక్షణాలు జీర్ణక్రియలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. నాన్ వెజ్ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల కొంతమంది గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కొంటారు.

నాన్ వెజ్ తిన్నాక ఆహారాల విషయంలో జాగ్రత్త
అందుకే పొరపాటున కూడా నాన్వెజ్ తిన్న తర్వాత తీసుకునే ఆహార పదార్థాలు ఎంపిక విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు ఒకవేళ నిర్లక్ష్యంగా ఏది పడితే అది తింటే ఏది పడితే అది తాగితే కచ్చితంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+