వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Beauty tips: అందం కోసం ఏవేవో వాడకండి.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు.. ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని భావిస్తారు. అందంగా ఉండడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీమ్లు ఉపయోగిస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి, అందంగా మారెందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అందంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం సునాయాసంగా చేయగలిగిన ఈజీ బ్యూటీ టిప్స్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్స్ మనం ఇళ్ళల్లోనే చేసుకోవటం మంచిది.

అందం కోసం చెయ్యాల్సిన మొదటి పని ఇదే

అందం కోసం చెయ్యాల్సిన మొదటి పని ఇదే


అందంగా ఉండాలి.. ఆకర్షణీయంగా ఉండాలి అని భావించేవారు కొన్ని బ్యూటీ టిప్స్ ను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. అందులో ముఖ్యంగా అందం కోసం ప్రతి ఒక్కరు సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగాలి. ప్రతిరోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు తాగినట్లయితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరం ఎప్పుడైతే హైడ్రేటెడ్ గా ఉంటుందో అప్పుడు చర్మం అందాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి తప్పనిసరిగా తగినన్ని నీటిని తాగాలి. ఇక వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నిగారింపును సంతరించుకుంటుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరం పైన వచ్చే అనేక ఎలర్జీలు కూడా రాకుండా ఉంటాయి.

అందానికి ఈ ప్యాక్స్ తో ఎంతో మేలు

అందానికి ఈ ప్యాక్స్ తో ఎంతో మేలు

ఇక లేత కొబ్బరి తో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం చాలా నిగారింపును సంతరించుకుంటుంది. లేత కొబ్బరి తో వేసుకునే ఫేస్ ప్యాక్ మెరుపు అందాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది. అందమైన చర్మం కోసం ఆర్టిఫిషియల్ గా మార్కెట్లో దొరికే క్రీమ్లను ఉపయోగించే కంటే సహజ పద్ధతులతోనే అందంగా మారవచ్చని తెలుస్తుంది. ఇక మనం ఇంట్లోనే తయారు చేసుకునే బొప్పాయి, టమోటా ఫేస్ ప్యాక్ లు కూడా అందాన్ని మరింత పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా అవసరం

చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా అవసరం

ఎక్కువగా పండ్ల రసాలు తాగడంతో కూడా చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మన స్కిన్ నిగారింపును సొంతం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. తల స్నానం చేసిన తర్వాత కొంచెం నీటిలో నిమ్మరసం కలిపి జుట్టుకు రాస్తే కుదుళ్లు గట్టిగా తయారవుతాయని, జుట్టు రాలడం తగ్గుతుందని చెబుతున్నారు. ఇక అంతే కాదు ఉప్పునీటితో కంటిని కడగడం వల్ల కళ్ళు మెరుపును సంతరించుకుంటాయని అంటున్నారు.

అందం కోసం ముఖానికి స్టీమ్ తీసుకోవటం మంచిది

అందం కోసం ముఖానికి స్టీమ్ తీసుకోవటం మంచిది

అందంగా ఉండాలని భావించేవారు అప్పుడప్పుడు ముఖానికి స్టీమ్ పెట్టుకోవడం ఎంతో అవసరం. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖంలో ముడుచుకుపోయిన స్వేద గ్రంధులు శుభ్రపడి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు, దుమ్ము ఆవిరి పట్టడం వల్ల తొలగిపోతాయి. దీంతో కూడా ఫేస్ చాలా ఆకర్షణీయంగా,యాక్టివ్ గా కనిపిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: బెల్లంతో ఆరోగ్యం.. చిన్న బెల్లంముక్క ఎన్ని రోగాలకు చెక్ పెడుతుందో తెలుసా!!health tips: బెల్లంతో ఆరోగ్యం.. చిన్న బెల్లంముక్క ఎన్ని రోగాలకు చెక్ పెడుతుందో తెలుసా!!

English summary
Do not use any of the various beauty creams available outside for beauty.. Try these simple home tips for your skin glow and beauty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X