Coriander Leaves Benefits: కొత్తిమీర లేకుండా కర్రీ చేసుకుంటున్నారా.. అయితే సమస్యలు తప్పవు..!
కొంత మందికి కొత్తిమీర అంటే ఇష్టం ఉండదు. ఆహారంలో కొత్తిమీర వస్తే తీసివేస్తుంటారు. కానీ కొత్తిమీర ఉపయోగాలు తెలిస్తే తినకుండా ఉండలేరు. ఈ కొత్తిమరును అన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. కొత్తిమీరలో అనేక ఔషధాలు ఉన్నాయి. కొత్తిమీర అనేక బయోయాక్టివ్ అంశాలను కలిగిఉంటుంది. దీని వల్ల ఈ మూలికలోని వివిధ భాగాలు అనేక ఔషధ లక్షణాలను ప్రదర్శిస్తాయి. కొత్తిమీరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
కొత్తమీర మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కని ఔషధంగా పని చేస్తుంది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో ఉండే ఐరెన్ గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తోంది. ప్రతి రోజు కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకుంటే బీపీ కూడా అదుపులో ఉంటుందట. కొత్తమీరను మజ్జికలో కూడా వేసుకుని తింటే మంచిద. అల్సర్ ఉన్న వారికి కొత్తమీర దివ్య ఔషధంగా పని చేస్తుంది.

కొత్తిమీరలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ కళ్లు త్వరగా చూపును కోల్పోకుండా ఉంటుంది. కొత్తిమీర కాడల్లో సిట్రోలినన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సూక్షజీవుల పెరగనివ్వకుండా చేస్తుంది. కొత్తిమీర ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. కొత్తిమీర తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొత్తిమీరలో విటమిన్-K ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి తగ్గేలా చేస్తుంది. గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications