బీరు తాగడంవల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఈరోజుల్లో ఆల్కహాల్ సేవించడం ఎంతో ఫ్యాషనైపోయింది. వీకెండ్ అనే పదం అందుబాటులోకి వచ్చిన తర్వాత శని, ఆదివారాలు వస్తే కచ్చితంగా స్నేహితులతో కలిసి మందు కొట్టాలి, ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలోనే నేటి యువత ఉంది. అయితే కొందరు బీర్లు తాగుతుంటారు. దీనిలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంటుంది. పురుషులే కాకుండా మహిళలు కూడా బీర్లు తాగడానికి అలవాటు పడ్డారు. ప్రాచనీ భారతీయ సంస్కృతిని ఆడవాళ్లు నెమ్మదిగా వదిలిపెడుతున్నారు. దీంతో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరూ కలిసి బీర్లు తాగుతున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
బీరు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుందనే విషయం బయటకు వచ్చింది. దీన్ని పరిమితంగా తీసుకోవల్సినంత స్థాయిలో తీసుకుంటే కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. విటమిన్ బి, ప్రొటీన్ ఫైబర్ వంటి కొన్ని పోషకాలు కూడా బీరు సొంతం. ఇందులో నూటపాతిక కేలరీలు ఉంటాయి. శరీరంలో ఎల్ డీఎల్ కు బదులుగా హెచ్ డీఎల్ స్థాయిని పెంచడంతోపాటు గుండెపోటును నివారిస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయులుక్షీణిస్తుంది.

క్యాన్సర్లను నివారిస్తుంది
క్యాన్సరు రావడాన్ని చాలావరకు బీరు తగ్గిస్తుంది. మూత్రపిండాళ్లో రాళ్లను తగ్గించడం, బోలు ఎముకల వ్యాధి రాకుండా చూడటంతోపాటు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది. దీనిలో కరిగే ఫైబర్ ఉంటుంది. బీరును గోధుమలు, మాల్టెడ్ బార్లీతో లేదంటే మొక్కజొన్నతో తయారుచేస్తారు. బ్రూయింగ్ ప్రక్రియలో పులియబెట్టి తయారుచేస్తారు. దీన్ని లిక్విడ్ బ్రెడ్ అంటారు. లిక్విడ్ బ్రెడ్ ను ఆహారంగా పరిగణిస్తారు. అయితే బీరును అధికంగా తీసుకోవడంవల్ల బ్లడ్ షుగర్ లో అసమతుల్యత చోటుచేసుకుంటుంది. అకాల మరణం లేదంటే డిప్రెషన్, ఆల్కహాల్ డిపెండెన్స్ లాంటి ప్రమాదాలు పొంచివున్నాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు బీరు తీసుకోకుండా ఉండటమే మంచిది. వీకెండ్ అనేది వస్తే ఆ రెండురోజులు మనసును ఆధ్యాత్మిక కార్యక్రమాలవైపు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: పై వార్తలోని అంశాలను ఇంటర్నెట్ నుంచి సేకరించడం జరిగింది. పర్యవసానాలు, నిర్థారణలనేవాటికి మాత్రం వన్ ఇండియా బాధ్యత వహించదు. పూర్తిస్థాయి సమాచారం కావాలంటే నిపుణులను సంప్రదించడం మంచిది.












Click it and Unblock the Notifications