వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జట్టు బలంగా, ఒత్తుగా అవ్వాలంటే ఇలా చేయండి!

|
Google Oneindia TeluguNews

మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మన జట్టు కూడా అంత బలంగా, అంత ఒత్తుగా ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామందికి జట్టు సమస్య ఎదురవుతోంది. అనారోగ్య సమస్య ఎదురైనప్పుడల్లా జుట్టు ఊడిపోవడం జరుగుతూనే ఉంటోంది. దీన్ని నియంత్రించడానికి మార్కెట్ లో రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. దానివల్ల మరింతగా సమస్య పెరుగుతుందేకానీ జుట్టు ఊడిపోవడం మాత్రం ఆగలేదు. దుమ్ము, కాలుష్యం, మట్టి వల్ల ఎక్కువ సంఖ్యలో జట్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే బలమైన జుట్టు కోసం, ఊడిపోకుండా ఒత్తుగా ఉండేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలున్నాయి. అవి తెలుసుకుందాం.

* మందారం పువ్వు: ప్రతిరోజు మందార టీ తాగడం వల్ల జుట్టుకు అంతర్గతంగా పోషణ లభిస్తుంది. తల చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది. అనేకరకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

best foods promote the hair growth.. here is all

* పుదీనా: ప్రతిరోజు పుదీనా ఆకులను నమలడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.. జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
* రోజ్ మేరీ: ఈ నూనె వాడటంల్ల కూడా జట్టు సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాదు.. జుట్టు దృఢంగా, మందంగా తయారవుతుంది. జట్టు సమస్యతో బాధపడేవారు ఈ నూనెను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
* లావెండర్ టీ: లావెండర్ టీ ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల కూడా సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జట్టు పెరుగుదలకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
* అలోవెరా: జుట్టు సమస్యలను కలబంద జెల్ అద్భుతంగా పరిష్కరిస్తుంది. దీన్ని వాడటంవల్ల హెయిర్ దృఢంగా, మందంగా తయారవుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* తలకు కొబ్బరినూనె రాసుకునేవారు ఆ నూనెలో మందారం, కరివేపాకు, వేప ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. వీటిని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు.
* ఒత్తిడివల్ల జట్టు ఊడిపోతుంటుంది. మానసిక ఆరోగ్యం బాగుండేటట్లు చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవడంతోపాటు ఎక్కువసేపు నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి.

English summary
The healthier our body is, the stronger and stronger our team is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X