మమతకు గవర్నర్ బిగ్ షాక్..! బెంగాల్ అసెంబ్లీ రద్దు..!
పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగబోనని భీష్మించుకుని కూర్చొన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. మమత ముఖ్యమంత్రి సీటు నుంచి దిగకపోవడంతో ఎదురవుతున్న రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన బెంగాల్ గవర్నర్ బీఎన్ రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ (West bengal assembly) ని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ గడువు ముగిసిపోవడం, ఓటమిపాలైనా సీఎం పదవికి రాజీనామా చేయబోనని మమతా బెనర్జీ భీష్మించుకుని కూర్చొన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో రంగంలోకి దిగిన గవర్నర్ ఆర్.ఎన్. రవి రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని ప్రయోగించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించడం అనే చివరి ప్రయత్నానికి రాష్ట్ర శాసనసభను రద్దు చేసి గవర్నర్ చెక్ పెట్టారు.

వాస్తవానికి బెంగాల్ శాసనసభ గడువు ఇవాళ్టితో ముగుస్తోంది. సాయంత్రం రాజ్‌భవన్ నిన్న జారీ చేసిన ఒక లేఖను సాధారణ సమాచారం కోసం బయటపెట్టింది. ఇందులో "భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ (2) యొక్క సబ్-క్లాజ్ (బి) ద్వారా నాకు సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి, నేను పశ్చిమ బెంగాల్ శాసనసభను 07 మే 2026 నుండి అమలులోకి వచ్చేలా రద్దు చేస్తున్నాను అని గవర్నర్ ఆర్ ఎన్ రవి పేర్కొన్నారు. దీంతో మమతా బెనర్జీ పంతం గవర్నర్ ఉత్తర్వులో కొట్టుకుపోయినట్లయింది. అంతే కాదు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.














Click it and Unblock the Notifications