Heart News: చెడు కొలెస్ట్రాల్ కట్టడికి ఇవి తింటే సరి.. హృదయారోగ్యానికి బెస్ట్, గుండె సమస్యలకు చెక్
Health News: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయుల సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. ఫుడ్ మాత్రమే కాకుండా ఇక్కడ లభించే నీటికి కూడా ప్రత్యేకత ఉందని ఇటీవల పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. రీసెంట్‌గా రిలీజైన ఓ నివేదిక కూడా భారతీయుల ఆహారపు అలవాట్లను కొనియాడింది. ఆరోగ్యకరమైన జీవితానికి అవి ఎంతగానో దోహదపడుతున్నట్లు పేర్కొంది.
గుండె ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. తద్వారా హార్ట్ స్ట్రోక్ వంటి హృదయ సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయి. శరీరంలో ఈ కొవ్వు స్థాయిలను సరిగ్గా నిర్వహించడంలో తినే ఆహారంతో పాటు జీవనశైలి ప్రముఖ పాత్ర వహిస్తుంది. గుండె జబ్బులతో బాధపడే అవకాశాన్ని తగ్గంచడానికి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చాలి. పలు భారతీయ ఆహారాల్లో ఇది అధికంగా ఉండటంతో హృద్రోగాలకు చెక్ పెట్టవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

అధిక కొలెస్ట్రాల్‌ను అరికట్టే ఆహారాన్ని స్వీకరించడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందుకోసం అల్పాహారం, భోజనం లేదా స్నాక్స్ లో భారతీయ సూపర్‌ఫుడ్‌లను చేర్చడం ప్రారంభించాలి. ఏ విధమైన మందులు వాడకుండా సహజంగా కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడే అత్యుత్తమ భారతీయ సూపర్‌ఫుడ్‌లు ఇక్కడ ఉన్నాయి.
ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని బీటా-గ్లూకాన్ కొలెస్ట్రాల్‌ను రక్తప్రవాహంలోకి శోషించనీయదు. అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు లిగ్నాన్స్‌తో నిండి ఉంటాయి. ఇవి రెండూ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ చిన్న గింజలను స్మూతీస్, పెరుగు లేదా సలాడ్‌లతో కలిపి తీసుకోవచ్చు. అవిసె గింజలు LDL స్థాయిలను తగ్గించడమే కాకుండా మొత్తం గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గింపుతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది. పచ్చి లేదా వండిన వెల్లుల్లి గుండెకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించడమే కాకుండా భోజనం రుచిని కూడా పెంచుతుంది. పప్పులు, కాయధాన్యాల్లో ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. పాలకూర, బచ్చలికూరలో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. బచ్చలికూరలోని లుటీన్ అనే కెరోటినాయిడ్ కొలెస్ట్రాల్ స్థాయిల తగ్గింపుకు పనిచేస్తుంది.












Click it and Unblock the Notifications