ఈ ఆకుతో మధుమేహం పరార్.. గుండె సమస్యలకూ చెక్..!

ప్రస్తుతం మధుమేహం, గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్ (మధుమేహం) అనేది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనికి కారణం మన శరీరం తగినంత ఇన్సులిన్‌ ను తయారు చేయలేకపోవడం.. ఇన్సులిన్‌ ను సరిగ్గా ఉపయోగించుకోలేక పోవడంగా వైద్యులు వివరిస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడేవాళ్లు తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, బరువు తగ్గడం, కంటిచూపు మసకబారడం, అలసట తదితర అనారోగ్య సమస్యలతో ఉంటారు. డయాబెటిస్ వల్ల గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, దృష్టి నష్టం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ రావొచ్చని వైద్యులు చెబుతున్నారు.

అలాగే ప్రస్తుతం గుండె జబ్బులు కూడా అధికం అవుతున్నాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, మద్యపానాన్ని తగ్గించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడొచ్చని వైద్యులు వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు డయాబెటిస్, గుండె జబ్బులకు ఒకే ఆకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అవే తమలపాకులు.. ఈ తమలపాకుల్లో మినరల్స్​, ఫైబర్​, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, కాల్షియం, విటమిన్​ సీ ఇలా బోలెడు పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

అయితే డయాబెటిస్ తో బాధపడేవాళ్లు.. 12 వారాలపాటు రోజుకు 3 గ్రాముల తమలపాకుల పొడిని నీటిలో వేసుకొని తాగితే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని ఇది పరిశోధనలో తేలిందని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లకు తమలపాకులోని ఔషధ గుణాలు చక్కగా పనిచేస్తాయట. తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం.. సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Betel Leaves Doctors Reveal Natural Aid for Diabetes Heart Health

ఇక తమలపాకులతో చేసిన తాంబూలం నోటిలో వేసుకోవడం వల్ల ఆకలిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఛాతీలో నొప్పి, గుండెలో మంట.. సమస్యలతో బాధపడేవారు టీ స్పూన్‌ తమలపాకుల రసాన్ని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. అంతేకాక తమలపాకులో ఉన్న ఔషధ గుణాల వల్ల నోటిలో జబ్బులకు కారణమైన బ్యాక్టీరియాను సంహరించగలదట. ఇక తమలపాకు మూత్రాన్ని సులభంగా జారీ చేసి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడగలదని వైద్యులు వివరిస్తున్నారు. అందువల్ల తమలపాకును రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+