నాటు గుడ్డు.. ఫారం గుడ్డు - ఎవరికి ఏది మంచిది..!?
కోడిగుడ్డు వినియోగం ఈ మధ్య కాలంగా గణనీయంగా పెరిగింది. కోడిగుడ్డు ఒక పోషకాల గని. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ ఉన్నవారు కూడా మితంగా గుడ్లు తినవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, నాటు కోడి గుడ్డు మంచిదా ఫారం కోడిగుడ్డు మంచిదా అనే సందేహం ఎక్కువగా కనిపిస్తోంది. దీని పైన పోషకాహార నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
కోడిగుడ్డులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే, దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువలన వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు. అయితే, చాలా మందికి ఒక సందేహం ఉంది. మనం తినే గుడ్లలో నాటు కోడి గుడ్డు మంచిదా లేక ఫారం గుడ్డు మంచిదా అని. కాగా.. ఎక్కువగా బాయిల్డ్ ఎగ్ శరీరానికి చాలా మేలు చేస్తుందంట. ముఖ్యంగా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు ఒక కోడి గుడ్డు తీసుకోవడం వలన ఇది గుండె పోటు, స్ట్రోక్, లేదా ఇతర హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా రక్త నాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. గుడ్డు తీసుకోవడం వల్ల శరీరం బరువును అదుపులో ఉంచుతుంది. అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకుంటే మంచిది.

నిపుణుల సూచనలు
అదే విధంగా ఫారం కోడిగుడ్డులోనైనా.. నాటు కోడి గుడ్డులోనైనా పోషకాలు ఒకే విధంగా ఉంటాయి. ఏ గుడ్డు తిన్నా.. పోషకాలు మాత్రం శరీరానికి పుష్కలంగా అందుతాయి. ప్రోటీన్ల స్థానంలో గుడ్డు అగ్ర స్థానంలో ఉంది. పప్పుల్లో ఉండే ప్రోటీన్లతో పోలిస్తే గుడ్డులోని ప్రోటీన్లే చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. నాటు కోడి గుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయని అంతా అనుకుంటారని.. కానీ అందులో వాస్తవం లేదని చెబుతున్నారు. ఈ రెండు రకాల గుడ్డుల్లో ఒకే పరిమాణంలో పోషకాలు ఉంటాయని వివరిస్తున్నారు.













Click it and Unblock the Notifications