"క్యాబేజీ క్రిస్పీ పకోడీ" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..!
సాధారణంగా సాయంత్రం వేళల్లో ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలని అనిపించడం సహజం. అలాంటి సమయంలో చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పకోడీలే. సాధారణంగా ఉల్లిపకోడీ, మిర్చి బజ్జీలు చేస్తుంటారు. అయితే ఈసారి కాస్త డిఫరెంట్‌గా, రుచిలో మరింత స్పెషల్‌గా ఉండే క్యాబేజీ క్రిస్పీ పకోడీని ట్రై చేయండి. బయట నుంచి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ టెక్స్చర్‌తో ఉండే ఈ పకోడీలు ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.
క్యాబేజీ అంటే పెద్దగా ఇష్టపడని వారు కూడా ఈ పకోడీని ఎంతో ఇష్టంగా తింటారు. క్యాబేజీలో ఉండే స్వల్ప తీపి రుచి, మసాలాల స్పైసీనెస్‌తో కలిసిపోయి అద్భుతమైన ఫ్లేవర్‌ను ఇస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో వేడి వేడి పకోడీలు కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తే ఆ ఫీల్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఉల్లిపకోడీతో పోలిస్తే క్యాబేజీ క్రిస్పీ పకోడీలు మరింత లైట్‌గా, ఎక్కువ క్రంచీగా ఉంటాయి. పైగా ఇవి చాలా తక్కువ సమయంలో, ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే సులభంగా తయారవుతాయి. పిండిలో కొంచెం సేమియా కలిపితే ఇంకా ఎక్కువ క్రంచీగా అవుతుంది. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు..
చిన్న సైజ్ క్యాబేజీ - 1
ఉల్లిపాయ - 1
కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
పచ్చిమిర్చి - 3
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
శనగపిండి - ½ కప్పు
బియ్యప్పిండి - 2 టేబుల్‌స్పూన్లు (క్రిస్పీదనం కోసం)
వేడి నూనె - 1 టేబుల్‌స్పూన్
బేకింగ్ సోడా - ¼ టీస్పూన్
ఉప్పు - సరిపడా
తయారీ విధానం..
ఉల్లిపాయను సన్నగా, పొడుగ్గా తరిగుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. క్యాబేజీని కడిగి, గ్రేటర్‌తో సన్నగా తురుమాలి - సుమారు 2 కప్పుల వరకు.
ఒక పెద్ద బౌల్‌లో క్యాబేజీ తురుము, ఉల్లిపాయ (చేత్తో స్వల్పంగా నలిపి), కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి
ఈ మిశ్రమంలో శనగపిండి, బియ్యప్పిండి కలపాలి. ( ప్రత్యేకంగా నీరు కలపకూడదు)
ఇప్పుడు వేడి నూనె 1 టేబుల్‌స్పూన్, బేకింగ్ సోడా చేర్చి బాగా కలపాలి.
కడాయిలో నూనె వేడి చేయాలి. ముద్దలుగా లేదా చిన్న గారెలా తీసి నూనెలో వేసాలి.
మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.
తీసి టిష్యూపేపర్‌పై పెట్టి అదనపు నూనె తొలగించాలి.
వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి రెట్టింపు అవుతుంది. టమాటో సాస్, పుదీనా పచ్చడి, కారం సాస్ ఇవేం ఉన్నా సూపర్‌గా కాంబినేషన్ అవుతుంది.
చిట్కాలు..
పెద్ద క్యాబేజీ అయితే సగం మాత్రమే ఉపయోగించాలి.
పిండిలో నీరు వేసేయొద్దు, లేకపోతే పకోడీ సన్నగా అవుతుంది.
వేడి నూనె వేసే ముందు నూనె బాగా కాగాలి.
బియ్యప్పిండి క్రిస్పీదనాన్ని పెంచుతుంది - కావాలంటే కొంచెం అదనంగా కూడా వేసుకోవచ్చు.
మరింత స్పైసీ కావాలంటే కారం బదులుగా చికెన్ మసాలా / గరం మసాలా కొద్దిగా వేసుకోవచ్చు.
క్యాబేజీ మోతాదు ఎక్కువైతే పిండికి వడివడిగా టెక్స్చర్ వస్తుంది.












Click it and Unblock the Notifications