"క్యాబేజీ పప్పు" ఇలా చేస్తే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఫుల్ ఫిదా !!!
మీ పిల్లలు క్యాబేజీ పేరు వింటేనే ముఖం తిప్పుకుంటున్నారా? అయితే ఈసారి సాధారణ క్యాబేజీ కూర బదులుగా క్యాబేజీ పప్పుని తప్పకుండా ట్రై చేయండి. రుచికరంగా ఉండడమే కాకుండా.. తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే ఈ పప్పు ఇంట్లో అందరి ఫేవరెట్‌గా మారుతుంది. పప్పులో కలిసిపోయే క్యాబేజీ రుచి పిల్లలకు నచ్చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు.
ఈ పప్పు ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో కూరగాయల పోషక విలువలు, పప్పుల ప్రోటీన్ శక్తి, టమాటా, పచ్చిమిరపకాయల టాంగీ టేస్ట్ అన్నీ కలిసి ఒక సంపూర్ణ భోజనంగా మారుతుంది. అలానే క్యాబేజీ వాసన లేకుండా రుచిగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా కలిసొస్తుంది. ఈ పప్పు అన్నం, రోటీ, చపాతీకి కూడా బాగా సరిపోతుంది.

కావలసిన పదార్థాలు
ప్రధాన పదార్థాలు:
-
కందిపప్పు – 1 కప్పు
-
క్యాబేజీ తరుగు – పావు కేజీ
-
పెద్ద ఉల్లిపాయ – 1
-
టమాటాలు – 4
-
పచ్చిమిరపకాయలు – 10 నుంచి 15 (రుచికి తగ్గట్టు)
-
చింతపండు – కొద్దిగా
-
పసుపు – పావు స్పూన్
-
ఉప్పు – రుచికి సరిపడా
పోపు కోసం:
-
వెల్లుల్లి రెబ్బలు – 10
-
కొత్తిమీర తరుగు – కొద్దిగా
-
ఆవాలు – సగం స్పూన్
-
జీలకర్ర – సగం స్పూన్
-
ఎండు మిరపకాయలు – 2
-
కరివేపాకు – 2 రెబ్బలు
-
నూనె – 4 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ తీసుకుని, అందులో శుభ్రంగా కడిగిన కందిపప్పు, క్యాబేజీ తరుగు, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తరుగు, కొద్దిగా నూనె వేసి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఎక్కువ మంటపై నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపి, ఆవిరి పూర్తిగా పోయే వరకు వేచి ఉండాలి.
ఆ తర్వాత మూత తీసి, పప్పు గుత్తితో లేదా మథానితో పప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఈ దశలో క్యాబేజీ, టమాటా రుచులు పప్పులో బాగా కలిసిపోతాయి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
ఆపై కరివేపాకు రెబ్బలు, ఎండు మిరపకాయలు వేసి కాస్త వేయించిన తర్వాత ఈ పోపును పప్పులో కలపాలి. అంతే, నోరూరించే క్యాబేజీ పప్పు సిద్ధం.
చిన్న చిట్కాలు..
-
పిల్లల కోసం చేస్తే పచ్చిమిరపకాయల సంఖ్య తగ్గించవచ్చు
-
చివర్లో కొద్దిగా నెయ్యి వేస్తే మరింత రుచి వస్తుంది
-
కొంచెం మందంగా లేదా పలుచగా కావాలంటే నీటి మోతాదు మార్చుకోవచ్చు
సాధారణంగా చేసే క్యాబేజీ వంటకాలకు బదులుగా ఈసారి ఈ క్యాబేజీ టమాటా పప్పును ప్రయత్నించండి. క్యాబేజీ తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. కొత్త రుచులతో కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తూ, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి.
-
-
-
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications