తెలుగులో ఈ రేంజ్ క్రైమ్ థిల్లర్ ఊహించలేదే.. ట్రైలర్‌ అదిరింది..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ 'శంభాల' చిత్రంతో పెద్ద హిట్ కొట్టారు. గతేడాది రిలీజ్ అయిన ఈ డివైన్ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. అయితే శంభాల మూవీ ఇచ్చిన జోష్ లో ఆది సాయికుమార్ ఇప్పుడు మరో ఆసక్తికర కథాంశంతో సినిమా చేస్తున్నారు. అదే 'ఎస్ఐ యుగంధర్‌' ఇందుకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ మూవీలో పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా ఆది సాయికుమార్‌ కనిపిస్తున్నారు. ట్రైలర్ కమిషన్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఆఫీస్ ను చూపించడంతో స్టార్ట్ అవుతుంది. ఆది సాయి కుమార్ వచ్చి అక్కడున్న కానిస్టేబుల్ ను ఏమైంది బాబాయ్ అంటాడు.. దాంతో స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది.

సిటీ అవుట్ స్కట్స్ లో మూడు డెడ్ బాడీలు దొరికాయి.. ఐ డోంట్ థింక్ హి విల్ స్టాప్ హియర్.. నార్సిస్టిక్ బిహేవియర్.. వీడ్ని పట్టుకోవడం ఆ దేవుడు వల్ల కూడా కాదు అని స్పెషల్ టీమ్ చేతులెత్తేశారు.. డెడ్ బాడీ నీ వల్లే మిస్ అయింది. 24 అవర్స్ లో దొరకాలి. పగతో మనిషిని చంపినట్లే.. డెడ్ బాడీని పొడిచి పొడిచి.. ఆ రోజు రాత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడంది చూశాను.. అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. దీని వెనకాల మోటివ్ వేరే ఉంది. ఇన్ని డైవర్షన్స్ ఉన్న కాంప్లికేటెడ్ కేస్ ను ఫస్ట్ టైమ్ చూస్తున్నా.. వాడికొక పెక్యూలియర్ సైకోలాజికల్ డిజార్డర్ ఉందనుకుంటా.. ఒక క్రిమినల్ ను పట్టుకోవడానికి నువ్వూ ఓ క్రిమినల్ అయిపోతావా..? అనే డైలాగ్స్ ట్రైలర్స్ ను మరింత ఆసక్తికరంగా చేశాయి. చివర్లో ఐ విల్ బికమ్ ది గాడ్ అని రక్తంతో అద్దంపై రాసి ఉన్న దృశ్యాలు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. వరుస హత్యల చుట్టూ కథను నడిపిస్తూ.. ఒక్కో హత్య వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచుతోంది.

AadiSaikumar SI Yugandhar trailer released What is the real mystery behind the series of murders

ఈ సైకలాజికల్ మైండ్ సెట్ ఉన్న నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఎస్ఐ యుగంధర్‌ గా ఆది సాయి కుమార్ తీసుకునే నిర్ణయాలు, అతడి దూకుడు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఆది సాయికుమార్ కు శంభాల రేంజ్ లో మరో హిట్ పడినట్టేనని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన మేఘలేఖ హీరోయిన్‌ గా నటించింది. ఇక ఈ చిత్రానికి యశ్వంత్‌ దర్శకత్వం వహించారు. ప్రదీప్‌ జూలూరు నిర్మించారు. అలాగే ప్రణవ్‌ గిరిధరన్‌ సంగీతం అందించారు. ఎస్ఐ యుగంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 2 న విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+