"ఉద్యోగాల కోసం చూడొద్దు, ట్యాక్సీ కొనుక్కోండి..!"- డిప్యూటీ సీఎం షాకింగ్ సలహా..!

దేశవ్యాప్తంగా నిరుద్యోగం తాండవిస్తోంది. ఎక్కడ చూసినా నిరుద్యోగులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు (Jobs) భారీగా తగ్గిపోవడం, ప్రైవేటు రంగంలోనూ పోటీ పెరిగిపోవడంతో ఉద్యోగాలు రావడం గగనమైపోతోంది. దీంతో ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నిరుద్యోగుల్ని ఎలా సంతృప్తి పర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో యూత్ ఉద్యోగాల వెంట పరుగులు తీయొద్దని, ట్యాక్సీ కొనుక్కుని నడుపుకోండంటూ యూత్ కు యూపీ డిప్యూటీ సీఎం షాకింగ్ సలహా ఇచ్చారు.

యూపీ అసెంబ్లీ బరిలోకి టీమిండియా స్టార్ పేసర్..! ఎస్పీ కంచుకోటలో..!
యూపీ అసెంబ్లీ బరిలోకి టీమిండియా స్టార్ పేసర్..! ఎస్పీ కంచుకోటలో..!

కేవలం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల వెంటే పరుగులు తీయకుండా, స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ-రిక్షా లేదా టాక్సీ నడుపుకోవడం వంటి స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవడం ఎంతో మేలని డీసీఎం చేసిన సూచన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సెప్టెంబర్ 23న లక్నోలో జరిగిన భారత్ టాక్సీ సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాఠక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతరుల వద్ద జీవితాంతం ఉద్యోగం చేయడం కంటే, సొంతంగా క్యాబ్ లేదా టాక్సీ నడుపుకోవడం ద్వారా ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే వాహనం నడిపి, ఆ తర్వాత ఇంటికి వచ్చి కుటుంబంతో ప్రశాంతంగా గడపవచ్చని నిరుద్యోగ యువతకు వివరించారు.

Don t Chase Jobs Drive an E-Rickshaw UP Deputy CM Brijesh Pathak s Advice Draws Opposition Flak
Poll Tracker: ఈసారి యూపీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు? తేల్చేసిన ఒపీనియన్ పోల్..!
Poll Tracker: ఈసారి యూపీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు? తేల్చేసిన ఒపీనియన్ పోల్..!

వేరొకరి దగ్గర ఉద్యోగం చేసే వారికి ఇలాంటి స్వేచ్ఛ దొరకడం అసాధ్యమని ఉప ముఖ్యమంత్రి పాఠక్ చెప్పుకొచ్చారు. ఇంటికి దగ్గరగా ఉండే ప్రయాణికులను చేరవేస్తూ, మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ పని చేసుకోవచ్చని ఉదాహరణలతో వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రసిద్ధ సామెతను ఉటంకిస్తూ... ఇతరులపై ఆధారపడే వ్యక్తికి కలల్లో కూడా నిజమైన సుఖం ఉండదని, అందుకే స్వయం సమృద్ధే సరైన మార్గమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో డిప్యూటీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వమే, యువతను టాక్సీలు నడుపుకోమని ఉచిత సలహాలు ఇవ్వడం సరికాదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. సమాజంలో నిరుద్యోగిత తారాస్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనమని విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+