బీరు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా?

కాలంలో సంబంధం లేకుండా ఈరోజుల్లో బీరు తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది. దీన్ని తాగడంవల్ల కిడ్నీలోని రాళ్లు తొలగిపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ అది కేవలం అపోహే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బీరు తాగడంవల్ల కిడ్నీలో రాళ్లు బయటకు వస్తాయనేందుకు ఎటువంి ఆధారాలు లేవని అమెరికన్ అడిక్షన్ సెంటర్ పేర్కొంది.

పదే పదే బీరు తాగుతుండటంవల్ల మూత్రపిండాలు విఫలమవుతాయని, రక్తపోటు, క్యాన్సర్ తోపాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని స్పష్టం చేస్తున్నారు. బీరు తాగితే మూత్ర విసర్జన అవుతుందని, అప్పుడు శరీరం నుంచి రాయి బయటకు రావడం సులువవుతుందని భావిస్తుంటారు. ఆల్కహాల్ అయినా, బీర్ అయినా కిడ్నీలో రాళ్లను బయటకు తీయడంలో ఏదీ సాయపడదని ఏసీపీ నివేదిక తెలుపుతోంది.

can drinking beer remove kidney stones

మూత్రవిసర్జనను పెంచడానికి బీర్ పనిచేస్తుందని, ఇలా చిన్న రాళ్లను తీయడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ 5 మి.మీ కంటే పెద్ద రాళ్లను బయటకు తీయలేదని, వాటి పెరుగుదల మార్గం సుమారు 3 మి.మీ ఉంటుందని చెబుతున్నారు. మూత్రపిండాల్లో నొప్పి ఉన్నప్పుడు బీరు తాగితే ఆరోగ్య స్థితిని మరింత దిగజార్చుతుందని వెల్లడించారు. బీరు మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అధికంగా తీసుకోవడం డీ హైడ్రేషన్ కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

కిడ్నీ రక్తాన్ని శుభ్రపరుస్తుంది. దీనిద్వారా టాక్సిన్స్, అనవసరమైన పోషకాలను మూత్రం ద్వారా తొలగిస్తుంది. అయితే రక్తంలో విషపూరిత మూలకాల పరిమాణం పెరిగినప్పుడు కిడ్నీ వాటిని సరిగ్గా ఫిల్టర్ చేయలేదు. దీనివల్ల సమస్యలు ప్రారంభమవుతాయి. ఘనరూపంలో వ్యర్థాలు పేరుకుంటాయి. పొత్తికడుపులో ఒక వైపు లేదంటే వెనుక భాగంలో ఆకస్మిక నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+