కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీరు తాగుతున్నారా? అసలు విషయం తెలిస్తే!

కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. ఇది సహజంగా ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో సమృద్ధిగా ఉంటుంది. అయితే, మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నీరు తాగడం మంచిదా అనే ప్రశ్న చలా మందిలో ఉంది. అయితే ఇది వారి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

కొబ్బరి నీరులో పోషక విలువలు
కొబ్బరి నీరు సహజంగా పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఇతర ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీరులో తక్కువ శాతం చక్కెర , కొవ్వు ఉంటాయి, అందువల్ల ఇది ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించబడుతుంది.

Can people with kidney problems drink coconut water Is it dangerous to drink it

మూత్రపిండాల సమస్యలు
కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది, ఇది మూత్రపిండాల్లో కణికలు ఏర్పడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇందులో నెచురల్ సిట్రేట్ (Citrate) ఉండడం వల్ల, రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉన్నవారు కొబ్బరి నీరు త్రాగడం వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అయితే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, పొటాషియం శరీరంలో పేరుకుని, ప్రమాదకరమైన స్థాయికి చేరుకోవచ్చు. కొబ్బరి నీరులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల, కొంతమంది కిడ్నీ రోగులకు ఇది మేలు కాకపోవచ్చు. హైపర్‌కలేమియా ఉన్నవారు కొబ్బరి నీరు తాగేటప్పుడు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

క్రానిక్ కిడ్నీ డిసీజ్ :
దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలతో బాధపడేవారు ద్రవ పానీయాల (Fluid Intake) పరిమాణాన్ని నియంత్రించాలి. కొబ్బరి నీరులోని ఎలక్ట్రోలైట్లు, ముఖ్యంగా పొటాషియం అధిక స్థాయిలో ఉండడం వల్ల, CKD ఉన్నవారికి ప్రతికూల ప్రభావం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో ఉన్న వారు కొబ్బరి నీరు త్రాగే ముందు వైద్యుని సంప్రదించడం మంచిది. కొబ్బరి నీరు రక్తపోటును కొంతవరకు నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ, అధిక సోడియం లెవల్స్ ఉన్నవారు, లేదా సోడియం పరిమిత ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు, కొబ్బరి నీరు త్రాగేముందు జాగ్రత్తగా ఉండాలి.

ఎవరికి తాగొచ్చు? ఎవరికి తాగకూడదు?
చిన్నపాటి మూత్రపిండ రాళ్లు ఉన్నవారు. సాధారణ మూత్రపిండ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునేవారు. తక్కువ పొటాషియం స్థాయితో ఉన్నవారు కొబ్బరి నీరు తాగొచ్చు. అయితే హైపర్‌కలేమియా (అధిక పొటాషియం) ఉన్నవారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ఉన్నవారు. అధిక సోడియం నియంత్రణ అవసరమైన వారు కొబ్బరి నీరు తీసుకోకపోవడమే మంచిది.

మూత్రపిండాల సమస్య ఉన్నవారు కొబ్బరి నీరు త్రాగేముందు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. కొబ్బరి నీరు ఆరోగ్యకరమైనదైనా, అది కొన్ని మూత్రపిండ సమస్యలలో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి, మీకు కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉంటే, ముందుగా వైద్య నిపుణుల సలహా తీసుకుని, అవసరమైన మార్గదర్శకత్వాన్ని పాటించడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+