యాలకులతో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు

మన ఇంట్లో ఉండే వంటగది.. అందులో ఉండే పదార్థాలే దివ్యౌషధం లాంటివి. ఆయుర్వేదం ఏనాటినుంచో ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రధానంగా మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒక భాగం. వీటిని తినడంవల్ల రుచి పెరుగుతుంది. ఆహారంలో ఏలకులను చేర్చుకోవడంవల్ల రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలున్నాయి. ఏలకులను నీటిలో వేసి మరిగించిన నీటిని తాగడంవల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

శరీర ఆరోగ్యానికే కాకుండా నోటి ఆరోగ్యానికి కూడా ఏలకులు ఎంతో ప్రధానం. రోజుకో ఏలుక తీసుకోవడంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీన్ని నమలడంద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకంలాంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ పనితీరును బాగుగా చేస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే చిన్న చిన్న ఏలకులు తినవచ్చు.

cardamom

రక్తపోటును నియంత్రిస్తాయి. ఏలకుల పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరం నుంచి విషాన్ని బటయకు పంపుతుంది. జీవక్రియను పెంచుతుంది. త్వరగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఏలకులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం వేడిచేయాలి. తర్వాత రోజుకు రెండుసార్లు లేదంటే మూడుసార్లు తాగవచ్చు. ఇది జీవక్రియను పెంచుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. ఏలకుల నీరు తాగితే కడుపు నిండుతుంది. అతిగా తినకుండా ఉండటాన్ని నిరోధిస్తుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక యాలుక తీసుకుంటుండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+