Contraceptives: మాత్రలు వాడకుండానే గర్భం రాకుండా చేసుకోవచ్చు.. కొత్త విధానం తీసుకురానున్న కేంద్రం..
చాలా మంది గర్భం దాల్చకుండా ఉండేందుకు మాత్రలు వాడుతుంటారు. కానీ ఇలా చేస్తే భవిష్యత్తు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కేంద్ర ఆరోగ్య శాఖ అవాంఛిత గర్భాలను నిరోధించేందుకు కొత్త వైద్య విధానాన్ని తీసుకురానుంది. ఈ విధానంలో మాత్రలతో ఎలాంటి పని లేకుండా గర్భాన్ని నిరోధించ్చొచ్చు.
కొత్త విధానంలో నాలుగు సెంటీమీటర్ల పొడవుతో సూదిలా ఉండే సాధనాన్ని మోచేతి చర్మ కింద పైపొరలో అమర్చుతారు. ఇది గర్భాన్ని నిరోధించే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. దీంతో గర్భం రాదు. ఈ ప్రయోగాన్ని తొలుత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగించనున్నారు. ఈ సాధనాలను కేంద్రం ఉచితంగా సరఫరా చేస్తుంది.

అవాంఛిత గర్భాలతో పాటు ఒక కాన్పు తర్వాత మరో కాన్పుకు ఎక్కువ సమయం కోరుకునేవారికి ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. సంతానం కావాలని కోరుకున్నపుడు ఈ సాధనాన్ని సులభంగా తొలగించి, గర్భందాల్చవచ్చని చెబుతున్నారు. ఈ విధానాన్ని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టెవ్ ఇంప్లాంట్‌గా పిలుస్తారని అధికారులు తెలిపారు.
ఈ సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను పంపిణీ కేంద్రం భావిస్తోంది. స్టాఫ్ నర్సులు కూడా సులభంగా అమర్చేలా శిక్షణ ఇవ్వనున్నారు. పైగా, దీన్ని అమర్చుకోవడం వల్ల ఎలాంటి అసౌకర్యం కూడా కలగదని వైద్యులు వివరిస్తున్నారు. ఈ సాధనం తొలగించిన 48 గంటల తర్వాత గర్భందాల్చే అవకాశం ఉందట.












Click it and Unblock the Notifications