చియా సీడ్స్ వద్దా: వీటిని భేషుగ్గా ట్రై చెయ్యొచ్చు

చియా విత్తనాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసేవే అయినా అవి కొందరికి నచ్చవు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అధిక ఫైబర్, సూపర్‌ఫుడ్ శక్తి పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ- వీటిని పెద్దగా ఇష్టపడని వాళ్లు చాలామందే ఉన్నారు. చియా సీడ్స్ ను నానబెట్టిన అవి జిగురుగా, జెల్లీ మారడం వల్ల తినడానికి ఆసక్తి చూపరు.

నానబెట్టినప్పుడు చియా సీడ్స్ మ్యూసిలాజినస్ ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్లే ఇవి జిగురుగా మారుతాయి. పుడ్డింగ్‌లు, హైడ్రేషన్ స్నాక్స్‌కు ఇది అనువైనప్పటికీ, చాలామంది ఆ జిగురుతో కూడిన సీడ్స్ ను తీసుకోవడానికి ముందుకు రారు. అలాంటి వారికి చియా సీడ్స్ తో సమానమైన పోషక విలువలు ఉన్న ఇతర విత్తనాలు, గింజలు చాలా ఉన్నాయి.

చియా విత్తనాలను ఇష్టపడకపోయినా, పోషక ప్రయోజనాలను పొందాలనుకుంటే, ఇతర ఆల్టర్నేటివ్ సీడ్స్ తీసుకోవచ్చు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.

అవిసె గింజలు (Flax seeds): నానబెట్టినప్పుడు చియా విత్తనాల మాదిరిగానే జెల్‌ను ఏర్పరుస్తాయి గానీ అది తక్కువ పరిమాణంలో ఉంటుంది. నీటిలో నానబెట్టి తీసుకోవడం ఇష్టం లేని వాళ్లు.. ఈ సీడ్స్ ను పొడిగా మార్చవచ్చు. గోధుమ, జొన్న పిండిలో దీన్ని కలిపి చపాతి, రొట్టెలుగా తినవచ్చు.

నువ్వులు (Sesame seeds): ఫైబర్, హెల్తీ ఫ్యాటీ, కాల్షియం అధికంగా ఉంటాయి నువ్వుల్లో. ఇవి చియా సీడ్స్ లాగా జిగురుగా మారవు, కాబట్టి వీటిని చట్నీ పొడి, కూరలు, బేక్డ్ వస్తువులు, వంటకాల్లో విరివిగా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు దాదాపుగా చియా సీడ్స్ తో సమానం.

గుమ్మడి గింజలు (Pumpkin seeds): చియాను ఇష్టపడని వారికి గుమ్మడి గింజల్ బెస్ట్ ఆల్టర్నేటివ్. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. నేరుగా తీసుకోవచ్చు. వీటిలో మెగ్నీషియం, ప్రోటీన్లు అధికం. ప్రతి 28 గ్రాముల గుమ్మడి గింజల్లో సుమారు 7.3 గ్రాముల వరకు ప్రొటీన్లు ఉంటాయి. హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. సలాడ్‌లకు టాపింగ్‌గా, ట్రైల్ మిక్స్‌లలో, లేదా పెస్టోలలో వీటిని ఉపయోగించవచ్చు.

క్వినోవా (Quinoa): చియా సీడ్స్ కు మరో ప్రత్యామ్నాయం.. ఈ క్వినోవా సీడ్స్. ఫైబర్ తో పాటు మొక్కల ఆధారిత ప్రోటీన్లను శరీరానికి అందిస్తుంది. క్వినోవా ఫ్లేక్స్ ను పోరిడ్జ్, బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్, స్మూతీల్లో ఉపయోగించవచ్చు.

బాదం: ప్రతి ఔన్స్‌కు (సుమారు 23 బాదం గింజలు) 3.54 గ్రాముల ఫైబర్‌ను కలిగి ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడే యాంటీఆక్సిడెంట్ విటమిన్- ఈ ఇందులో అధికం. ఇవి ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. నూనెలో వేయించిన బాదంను గ్రీన్ బీన్స్‌పై చల్లితే రుచి పెరుగుతుంది. బాదం పాలను తీసుకోవచ్చు. సన్నగా తరిగిన బాదంను తాజా బ్రోకలీ లేదా సెలెరీ, క్రాన్‌బెర్రీ సలాడ్‌లో కలపవచ్చు.

పిస్తా: ప్రతి ఔన్స్‌కు (49 గింజలు) 3 గ్రాముల ఫైబర్‌ను కలిగి ఉంటాయి. పిస్తాలో విటమిన్ బి1 (థయామిన్), బి6 అధికంగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థకు తోడ్పడతాయి. ఆహారంలోని పోషకాలను శరీరం ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. ఇతర గింజల కంటే ఇవి తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. ఒక ఔన్స్‌కు 159 కేలరీలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+