vastu tips: మీ టేబుల్‌పై ఈ చిన్న మొక్కను ఆగ్నేయ దిశలో పెట్టండి.. మార్పులు చూడండి

వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అలాంటి వాటిలో మొదటి వరుసలో నిలిచేది 'మనీ ప్లాంట్'. కేవలం ఇళ్లలోనే కాదు, మనం రోజంతా గడిపే ఆఫీస్ డెస్క్‌పై ఈ చిన్న పచ్చని మొక్కను ఉంచడం వల్ల కెరీర్ గ్రాఫ్ ఊహించని విధంగా మారుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అసలు ఆఫీస్ టేబుల్‌పై మనీ ప్లాంట్ ఉంచితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి మాయం.. పాజిటివ్ వైబ్స్ సొంతం

ఆఫీస్ అంటేనే వర్క్ ప్రెజర్, డెడ్‌లైన్లు, కాంపిటీషన్. ఇలాంటి వాతావరణంలో మనకు తెలియకుండానే నెగెటివ్ ఆలోచనలు చుట్టుముడతాయి. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌కు చుట్టుపక్కల ఉన్న నెగెటివిటీని పీల్చుకునే శక్తి ఉంది. ఇది డెస్క్ చుట్టూ సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసి, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

Vastu tips Place this small plant on your table in the southeast direction and watch the changes

ఫోకస్ పెరుగుతుంది.. ఉత్సాహం ఉరకలేస్తుంది

పచ్చటి ప్రకృతిని చూస్తేనే కంటికి, మెదడుకు హాయిగా ఉంటుంది. మీ కంప్యూటర్ పక్కన మనీ ప్లాంట్ ఉండటం వల్ల పని మధ్యలో వచ్చే అలసట, ఒత్తిడి తగ్గుతాయి. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపి, చేసే పనిపై ఏకాగ్రతను రెట్టింపు చేస్తుంది.

కెరీర్‌లో తిరుగులేని పురోగతి

మనీ ప్లాంట్ కేవలం అందం కోసమే కాదు.. అది సక్సెస్‌ను ఆకర్షించే ఒక అయస్కాంతం లాంటిది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క నుంచి వచ్చే సానుకూల శక్తి వల్ల ఉద్యోగంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆఫీసులో మీ పనికి గుర్తింపు దక్కడం, ప్రమోషన్లు రావడం వంటి అనుకూల మార్పులు మొదలవుతాయి.

పెరగనున్న ఆర్థిక స్థిరత్వం

పేరులోనే 'మనీ' ఉన్న ఈ మొక్కను సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఆఫీస్ డెస్క్‌పై దీనిని ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సహోద్యోగులతో, పైఅధికారులతో సత్సంబంధాలు పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది.

మనీ ప్లాంట్‌ను ఎక్కడ, ఎలా ఉంచాలి?

మనీ ప్లాంట్ పూర్తి ఫలితాలు ఇవ్వాలంటే ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి. ఆఫీస్ డెస్క్‌పై మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. మొక్క ఎప్పుడూ పచ్చగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలో ఏదైనా ఆకు ఎండిపోయినా లేదా పసుపు రంగులోకి మారినా.. దానిని వెంటనే కత్తిరించి తొలగించాలి. ఎండిన ఆకులు డెస్క్‌పై ఉండటం మంచిది కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+