చికెన్ Vs మటన్: స్లిమ్ గా ఉండాలంటే ఏది తింటే బెస్ట్!
మనలో చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అటువంటి నాన్వెజ్ ప్రియులు బరువు తగ్గాలంటే కాస్త కష్టమే. అయినప్పటికీ బరువు తగ్గాలని భావించేవారు మటన్, చికెన్ ఈ రెండింటిలో ఏది తినాలి? ఏది తింటే బరువు బాగా తగ్గుతారు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చికెన్, మటన్ ప్రోటీన్ మూలాలు
చికెన్, మటన్ రెండు మంచి ప్రోటీన్ మూలాలుగా పరిగణించబడతాయి. ఈ రెండు బరువును నిర్వహించడంలో ముఖ్య భూమికను పోషిస్తాయి. అయితే చికెన్ , మటన్ లలో ఏది తింటే బరువు నిర్వహణలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న.

చికెన్ vs మటన్ .. క్యాలరీలు ఇలా
చికెన్ లో తక్కువ కొవ్వు కంటెంట్ ఉంటుంది. చికెన్ మంచి ప్రోటీన్ మూలం కావడంతో 100 గ్రాముల చికెన్ లో 125 క్యాలరీలు ఉంటాయి. ఇక మటన్ లో ఎక్కువ కొవ్వు, ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇది రుచిగా ఉండి, మన శరీరానికి కావలసిన శక్తి వనరుగా ఉన్నప్పటికీ 100 గ్రాముల మటన్ లో 294 క్యాలరీలు ఉంటాయి.
బరువు తగ్గాలని భావించేవారికి ఇది మంచి ఎంపిక
మటన్ కంటే చికెన్ లో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలని భావించే వారికి చికెన్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక చికెన్ తో పోలిస్తే మటన్ మన శరీరానికి కావలసిన ఎక్కువ ఐరన్ ను అందిస్తుంది. బి 12 వంటి ప్రయోజనాలను అందిస్తుంది ఎక్కువ శక్తిని అందిస్తుంది. మటన్ కూడా మన పూర్తి ఆరోగ్యానికి మద్దతు నిస్తుంది.
చికెన్, మటన్ లతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు
చికెన్ ప్రోటీన్, విటమిన్లు ఖనిజాలతో నిండి ఉండి కండరాల మెరుగుదలకు, కణజాల మరమ్మతుకు దోహదం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీర ఆరోగ్య తీరును మెరుగుపరుస్తుంది. ఇక మటన్ రోగనిరోధక శక్తిని, కండరాల పెరుగుదలను పెంచడంతోపాటు రక్తహీనతను నివారిస్తుంది.
బరువు తగ్గాలంటే ఇలా తినాలి
చికెన్ తో పెద్దగా కొలెస్ట్రాల్ పెరగదు. కానీ మటన్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. కనుక బరువు తగ్గాలనుకునే వారికి మటన్ కంటే చికెన్ మెరుగైన ఎంపిక. అయితే అది తరచూ తీసుకున్నప్పటికీ మితంగా డీప్ ఫ్రై లు, ఫ్రై లు లేకుండా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications