రోజూ ఇవి రెండు నోట్లో వేసుకోండి - షుగర్ కంట్రోల్, జీర్ణక్రియ సమస్యలకు చెక్.!!
లవంగాలు ప్రతీ ఇంటా ఉంటాయి. వీటితో ఆహారంలో రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు అందిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆక్సీకరణ నష్టం నుంచి లవంగం రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. రోజూ కేవలం 2 లవంగాలు నమలడం వల్ల అనేక ఆరోగ్య పరమైన లాభాలు ఉన్నాయి. పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ దీనిలో ఉంటాయి. అందుకే వీటిని పోషకాల పవర్‌హౌజ్ అని అంటారు.
ప్రత్యేక పద్ధతిలో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. రోజుకి రెండు లవంగాలు తింటే శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. లవంగాలలో వాపును తగ్గించే గుణాలను అధికంగా కలిగి ఉండటం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల వచ్చే వాపును తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. లవంగాల్లో యూజినాల్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుందని నిర్దారించారు. రోజువారీ ఆహారంలో భాగంగా వీటిని చేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చుని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో సీ విటమిన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, వాపు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం లేదా సాయంత్రం లవంగాలు మరిగించిన నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లవంగాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు
లవంగం జీర్ణ సమస్యకు అద్భుతమైన ఔషధం. ఇందులో జీర్ణక్రియను ప్రోత్సహించే సహజ జీర్ణ లక్షణాలను కలిగి ఉంటాయి. లవంగం రోజు తీసుకోవడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంతో పాటు జీర్ణక్రియను సులభ తరం చేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. లవంగాలలోని యూజినాల్, ఫ్లేవనాయు డ్లు వంటి సమ్మేళనాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని డయాబెటిస్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇవి గ్లూకోజ్ శోషణ తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడుతుందని తెలిపారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు లవంగాలను రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. లవంగాలలోని యూజినాల్ కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు, విష పదార్థాలను తొలగించడం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక, లవంగం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయి ల ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.













Click it and Unblock the Notifications