ట్రెండీ డైట్స్ లో కామన్ గా చేసే ఈ తప్పులే బరువు తగ్గకుండా చేస్తాయి!

ఊబకాయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద సమస్య. అయితే చాలామంది బరువు తగ్గడానికి ట్రెండీ డైట్లను ఆశ్రయిస్తున్నారు. కానీ సాధారణ తప్పిదాలు బరువు తగ్గే ప్రక్రియకు అడ్డుగా నిలుస్తున్నాయి. అసలు ఈ ట్రెండీ డైట్ లను ఫాలో చేస్తున్న వారు చేస్తున్న తప్పిదాలు ఏమిటి? ఎందువల్ల బరువు తగ్గడంలో ఉన్నటువంటి ఆహార విధానం వీరికి సహకరించడం లేదు? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

డైటింగ్ చేసేవారు చేసే తప్పులివే

చాలామంది డైటింగ్ చేస్తున్నాము అని చెబుతున్న క్రమంలో భాగంగా భోజనాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది శరీరంలో క్యాలరీలను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ అలా భోజనం స్కిప్ చేయడం వల్ల, మరోసారి భోజనం చేసినప్పుడు తెలియకుండానే అధిక మొత్తాన్ని ఆహారంలో తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గడం జరగదు. ఒక క్రమ పద్ధతిలో భోజనాన్ని చేస్తే, క్రమ పద్ధతిలో వీటిని నిర్వహిస్తే బరువు తగ్గడానికి ఇవి దోహదం చేస్తాయి.

Common Diet Mistakes is the reason for not getting good results in Weight Loss

ఇలా తింటే పోషకాహార లోపం.. బరువు నియంత్రణ ఎలా?

చాలామంది డైటింగ్ పేరుతో ఇది తినకూడదు అది తినకూడదు అని, తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని మాత్రమే ఎంపిక చేసుకొని తింటూ ఉంటారు. ఇలా తినడం పోషకాహార లోపానికి కారణమవుతుంది. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందకపోవడం వల్ల శరీరం సరిగ్గా బరువును నిర్వహించడం జరగదు. దీనివల్ల ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది.

సప్లిమెంట్ లు, నీళ్ళు తాగకపోవటం బరువును తగ్గించవు

కొంతమంది ఆహారాన్ని తినకుండా సప్లిమెంట్ల పైన ఎక్కువగా ఆధారపడతారు. సప్లిమెంట్లు పోషణకు సహాయపడినప్పటికీ అవి సహజ వనరుల నుండి లభించే మంచి ఆహారాన్ని, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అందించలేవు. ఇక డైటింగ్ చేస్తున్న చాలామంది సరిగ్గా నీళ్లు తాగకపోవడం కూడా ఒక సమస్య. శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం మెటబాలిజం సరిగా పనిచేసేలా చేస్తుంది.

డైటింగ్ మాత్రమే సరిపోదు అవి చెయ్యాల్సిందే

తగినంత నీరు తాగడం ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీర కార్యకలాపాలకు మద్దతు కూడా ఇస్తుంది. కాబట్టి సరిగా నీళ్లు తాగకపోయినా బరువు తగ్గాలనే ఆలోచన ఉన్న వారి కోరిక తీరదు. ఏ కొంతమంది డైటింగ్ మాత్రమే చేస్తూ మిగతా వాటి మీద ఫోకస్ చేయరు. శారీరక వ్యాయామం చేయడం, సరైన ఆహారపు నియమాలు పాటించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి చర్యలు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. ఎవరైతే వీటిని తూచా తప్పకుండా పాటిస్తారో వారు ఆరోగ్యకరంగా బరువు తగ్గడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+