నాటు కోడితో నలభై రకాల లాభాలు.. అందుకే ఫుల్ డిమాండ్!
బ్రాయిలర్ కోడి కంటే నాటుకోడి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో బోలెడన్ని పోషక విలువలు ఉంటాయి. నాటుకోడి రుచికి కూడా చాలా బాగుంటుంది. భారతీయ వంటకాలలో నాటుకోడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సహజ వాతావరణంలో పెరిగే ఈ కోడి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. నాటుకోడి లో తక్కువ కొవ్వు కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యపరంగా మంచిదిగా పరిగణించబడుతుంది.
నాటుకోడిలో ఫుల్ పోషకాలు
నాటు కోడిలో ప్రోటీన్, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నాటు కోడిలో ఉండే పోషకాలు మన కండరాల వృత్తికి మద్దతునిస్తుంది. మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నాటుకోడి మాంసం మన గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది మన జీర్ణ ప్రక్రియకు కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. బాయిలర్ కోడి తో పోల్చుకుంటే నాటుకోడి త్వరగా జీర్ణమవుతుంది.

నాటు కోళ్ళు తింటే ఆరోగ్య ప్రయోజనాలు
నాటు కోళ్లు నేచురల్ గా పెరుగుతాయి కాబట్టి ఇవి మన శరీరానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. వీటిని ఒక సురక్షితమైన ఆహారపు ఎంపికగా చెప్పవచ్చు. నాటుకోడి లో సహజమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇది శరీరానికి సహజమైన శక్తిని అందిస్తుంది. రుచిలో, పోషకాలలో నాటుకోడి మాంసానికి మరేదీ పోటీ కాదు. ఫారం లో తెచ్చే బ్రాయిలర్ కోడి కంటే నాటుకోడి రుచి అమోఘంగా ఉంటుంది.
నాటు కోళ్ళపై జనాల దృష్టి
చాలామంది మాంసాహారులు నాటుకోడి మాంసాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. శరీరంలో అధిక కొవ్వుతో బాధపడేవారు కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రమాదాన్ని తగ్గించడానికి నాటు కోళ్లు తింటే మంచిది. నాటుకోడి తింటే ఎముకలు బలోపేతం అవుతాయి. ప్రస్తుతం మన సమాజంలో మళ్లీ నాటు కోళ్లపైన జనాల దృష్టి మళ్లింది. ధర ఎక్కువైనప్పటికీ కొనుగోలు చేసుకుని నాటుకోడి ని వండుకు తింటున్నారు.
నాటు కోళ్ళకు భారీగా పెరిగిన డిమాండ్
దేశీయ నాటుకోడిలో ఉండే పోషకాలు, అనేక తరాల నుండి నాటుకోడి మన శరీరానికి బలం అనే అభిప్రాయం వెరసి చాలామంది నాటు కోళ్లు తింటున్నారు. ఆరోగ్యంపై చైతన్యం వచ్చిన ఎంతోమంది నాటుకోడి శ్రేయస్కరమని భావించి తినడం వల్ల వీటి డిమాండ్ బాగా పెరిగింది. ధర ఎక్కువైనప్పటికీ చెల్లించి నాటుకోడి నే కొనుగోలు చేసుకుని తింటున్న వారు లేకపోలేదు. ఏది ఏమైనా నాటుకోడి మన శరీరానికి కావలసిన సమతుల ఆహారాన్ని అందించి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications