ఆఫీసులోనే అరగంట పాటు ఆ పని.. కంపెనీ క్రేజీ ఐడియా!
పని ఒత్తిడితో కూడిన రోజుల్లో సాధారణంగా ఉద్యోగులు సేద తీరడానికి కాఫీ తాగడం, సిగరెట్ తాగడం లేదా బాత్రూమ్ కు వెళ్లి రావడం వంటి విరామాలు తీసుకుంటూ ఉంటారు. చాలా కంపెనీలు ఈ విరామాలకు అవకాశం ఇస్తూ ఉంటారు. కానీ ఓ బాస్ మాత్రం ఈ ఆఫీస్ విరామాలను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లారు. బార్సిలోనాకు చెందిన అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ యజమాని అయిన ఎరికా లస్ట్.. ఇప్పుడు తన ఉద్యోగులకు ప్రతిరోజూ 30 నిమిషాల హస్తప్రయోగ విరామాన్ని ఇస్తోంది. కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో తన సిబ్బందిలో ఒత్తిడి, ఆందోళన తీవ్రంగా పెరగడాన్ని గమనించిన ఎరికా లస్ట్.. 2021లో ఓ వినూత్స ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ 30 నిమిషాల హస్తప్రయోగ విరామం ఇవ్వడం ప్రారంభించారు.
హస్తప్రయోగ కేంద్రం ఏర్పాటు
ఈ ప్రయోగం కోసం ఎరికా లస్ట్ తన ఆఫీసులోనే 'హస్తప్రయోగ కేంద్రం' పేరుతో ఓ ప్రత్యేకమైన, సురక్షితమైన ప్రైవేట్ గదిని ఏర్పాటు చేశారు. దీనికి ఎంత ఆదరణ లభించిందంటే.. సెక్స్ టాయ్ తయారీదారులు కూడా ఈ విరామానికి అవసరమైన పరికరాలను సరఫరా చేయడం విశేషం. ఓ ఏడాది పాటు ఈ ప్రయోగాన్ని పరిశీలించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఎరికా లస్ట్ గుర్తించారు. రోజువారీ విరామం తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా ఉండి పనిలో మరింత ఉత్పాదకతను చూపించారని లస్ట్ తెలిపారు. దీంతో ఈ విధానాన్ని ఆ సంస్థలో శాశ్వతంగా అమలు చేయడం ప్రారంభించారు. "నేను నా ఉద్యోగులకు విలువ ఇస్తాను, వారు సంతోషంగా ఉన్నప్పుడు బాగా పని చేస్తారని నాకు తెలుసు. విజయవంతమైన పని వాతావరణానికి ఒత్తిడి కంటే హానికరమైనది మరొకటి లేదు" అని లస్ట్ పేర్కొన్నారు.

హస్తప్రయోగం శ్రేయస్సు-ఆరోగ్య ప్రయోజనాలు
హస్తప్రయోగం అనేది మానసిక, శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉందని ఎరికా లస్ట్ అభిప్రాయపడ్డారు. వైద్య నిపుణులు, క్లీవ్‌ల్యాండ్ క్లీనిక్ అధ్యయనాల ప్రకారం.. హస్తప్రయోగం మితంగా చేసినప్పుడు శరీరంలో డోపమైన్, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్, ఎండార్పిన్ల వంటి కీలక హార్మోన్లు విడుదలవుతాయి.
ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మంచి నిద్రను అందించడానికి ఎంతో సహాయపడతాయి. విశ్రాంతి పొందడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఓ ప్రభావవంతమైన మార్గమని సెక్స్ థెరపిస్టులు చెబుతున్నారు. "హస్తప్రయోగం ఆరోగ్యకరమైనది. కొన్నిసార్లు విశ్రాంతి కోసం, కొన్నిసార్లు ఆనందాన్ని అనుభవించడానికి, కొన్నిసార్లు ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి లేదా ఏదైనా కష్టమైన మానసిక స్థితి లేదా భావోద్వేగం నుంచి ఉపశమనం పొందడానికి దీనిని చేస్తారు" అని సెక్స్ థెరపిస్ట్, రచయిత అయిన ఇయాన్ కెర్నర్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
శారీరక ఆరోగ్యంపై ప్రభావం
వైద్య అధ్యయనాలు హస్తప్రయోగానికి, జననేంద్రియ ప్రాంతానికి రక్త ప్రసరణ మెరుగుపడటానికి సంబంధం ఉందని తేల్చాయి. దీనివల్ల పురుషులలో ప్రోస్టేట్ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, బ్యాక్టీరియాను బయటకు పంపడం ద్వారా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇది మెరుగైన లైంగిక పనితీరుకు కూడా తోడ్పడుతుంది. మహిళల్లో దీని ద్వారా కలిగే భావప్రాప్తి, పొత్తికడుపులో మూత్రాశయం, ప్రేగులు, గర్భాశయానికి ఆధారాన్నిచ్చే కండరాల సమూహమైన పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలపరుస్తుంది. దీనివల్ల మూత్రం లీకేజ్, అనియంత్రిత మూత్రవిసర్జనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఈ సమస్య వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరిని ప్రభావితం చేస్తుంది.
వినూత్న విధానంపై చర్చ
హస్తప్రయోగం వల్ల ఆరోగ్య, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దానిని పని ప్రదేశంలో అనుమతించడం ఎంతవరకు సరైనదనే దానిపై అంతర్జాతీయంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications