కూరలో కరివేపాకులా తీసేయొద్దు.. ప్లీజ్

కరివేపాకు.. అంటే చాలు.. తీసి పక్కన పడేస్తారు. ఎవరినైనా ఉదాహరణగా చెప్పేటప్పుడు కూడా వాడిని కూరలో కరివేపాకులా తీసేశార్రా.. అని చెబుతుంటారు. అంటే ఏ కూర వండినా దానికి అద్బుతమైన రుచిని జోడించాలంటే కరివేపాకు కచ్చితంగా ఉండాలి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేకరకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంటాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కరివేపాకు ప్రభావం వెలకట్టలేనిది.

కరివేపాకు రసాన్ని ప్రతిరోజు తీసుకోవడంద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. 100 గ్రాముల కరివేపాకులో 108 కేలరీలు లభిస్తాయి. ఫైబర్, ప్రొటీన్, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, మెగ్నీషియం అధిక పరిమాణంలో ఉంటాయి. విటమిన్ సి, ఇ, బి1, బి9, బి2, బి3 కూడా ఉంటాయి.

curry leaves

కరివేపాకు రసం వల్ల కలిగే లాభాలు

* అధిక కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా కరివేపాకు రసాన్ని తీసుకోవాలి. గుండె సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజు 2 నుంచి 3 గ్లాసుల కరివేపాకు రసం తాగాల్సి ఉంటుంది.

* కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ప్రతి రోజు తీసుకోవడంవల్ల హానికరమైన టాక్సిన్స్ శరీరం నుంచి బయటికి వస్తాయి. ఇవి బయటకు రావడంవల్ల అనేక రకాల వ్యాధులు కూడా దూరమవుతాయి.

* కరివేపాకులో విటమిన్ ఎ ఉంటుంది. ప్రతి రోజు ఈ రసాన్ని తాగడం వల్ల కంటి చూపు సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. కనుచూపు మెరుగవుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

curry leaves

* మారుతున్న జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం జరుగుతోంది. దీనివల్ల చిన్నవయసులోనే ఊబకాయంతో బాధపడేవారు పెరుగుతున్నారు. అటువంటివారు ప్రతిరోజు కరివేపాకు రసాన్ని తాగడంవల్ల శరీరంలో డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. దీనివల్ల సులువుగా బరువు తగ్గుతారు.

* ప్రతి రోజు కరివేపాకు రసాన్ని తాగడంవల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉండే గుణాలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు సహాయపడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+