షుగరు వస్తే కిడ్నీలు పాడవుతాయా?
మనదేశంలో డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇది దీర్ఘకాలిక సమస్య.. దీర్ఘకాలిక రోగం. శరీరంలోని అవయవాల పనితీరు తగ్గుతుంది. అనుబంధంగా అనేక ఇతర వ్యాధులు వస్తాయి. ఇందులో రెండురకాల డయాబెటిస్ ఉంటుంది. టైప్ 1 జన్యుపరంగా వచ్చేది.. టైప్2 చెడు అలవాట్లు, కార్బొహైడ్రేట్స్ ఆహారం ఎక్కువగా తీసుకోవడంవల్ల సంభవిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రించకపోతే ఊబకాయంతోపాటు కిడ్నీ, గుండె జబ్బులు ఎలా వస్తాయో తెలుసుకుందాం.
గుండెకు ప్రమాదం : వరల్డ్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్ ప్రకారం డయాబెటిక్ రోగులు తరచుగా ఊబకాయం, అధిక రక్తపోటు, డైస్లిపిడెమియా వంటి గుండె సంబంధిత ప్రమాదాల అంచున జీవిస్తుంటారు. ఒక వ్యక్తికి షుగరు వస్తే భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. మధుమేహం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ సమస్య పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రతిరోజు చెక్ చేసుకుంటుండాలి. దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే అనారోగ్య సమస్యలను ముందే తెలుసుకొని జాగ్రత్తపడవచ్చు.

కిడ్నీకి ప్రమాదం : అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ క్లినికల్ జర్నల్ ప్రకారం డయాబెటిక్ రోగులలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కు కారణమవడం తీవ్ర ఆందోళనకరమవుతోంది. కిడ్నీలలోని చిన్న చిన్న రక్త నాళాలకు షుగరు హాని కలిగిస్తుంది. రక్తంలోని మలినాలను వడకట్టే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే కిడ్నీలు పాడవుతాయి. అప్పుడు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications