ఇష్టంగా బిస్కెట్లు తింటున్నారా? ఇవి తెలుసుకోండి..!!
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేవి ఏమిటని చెబితే అందరూ ఠక్కున చెప్పే పేరు బిస్కెట్లు. బిస్కెట్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అవి మన ఇంట్లో చేసుకునేవే అయితే ఇబ్బంది ఉండదుకానీ ప్యాకింగ్ చేసిన బిస్కెట్లు తినడంవల్ల అనారోగ్యానికి గురవుతాం. ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఎంతమేరకు వీటిని తీసుకుంటున్నాం, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఈ సమస్యలు మారుతుంటాయి.
బిస్కెట్లు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు
అధిక కేలరీలు... ఈ బిస్కెట్లు కేలరీలు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడానికి దారితీసి, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రాసెస్ చేసిన బిస్కెట్లలో అనేక రకాల రసాయనాలు కలుపుతారు. వాటిని తినకుండా ఉంటేనే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు, ముక్కిపోయిన వాసన రాకుండా ఉండేందుకు, బిస్కెట్ మెత్తబడకుండా కరకరలాడేందుకు... ఇలా రకరకాల రసాయనాలను బిస్కెట్లలో కలుపుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఆస్తమా పెరుగుతుంది
పోషక విలువలు తక్కువ... బిస్కెట్లలో విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి ముఖ్యమైన పోషక విలువలు తక్కువగా ఉండి మన శరీరానికి అవసరమైన పోషకాలు సరిపడా లభించవు. జీర్ణ సమస్యలు... ఈ బిస్కెట్లు అంత తొందరగా జీర్ణం కావు. ఎక్కువగా తీసుకుంటే అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని బ్రాండ్ల బిస్కెట్లలో కృత్రిమ రంగులు, రుచులు ఉంటాయి. ఇవి ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలను తీవ్రతరం చేస్తాయి.
గర్భిణీలు, పిల్లలు ఈ రకమైన బిస్కెట్లను తక్కువగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఏం చేయాలంటే..?
ప్రాసెస్ చేసిన బిస్కెట్లకు బదులుగా పండ్లు, కూరగాయలు, గింజలు, బ్రౌన్ బ్రెడ్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మంచిది. ఇంట్లోనే ఆరోగ్యకరమైన బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. బిస్కెట్లు తీసుకునేటప్పుడు కేలరీలు, కొవ్వులు, చక్కెర పరిమాణం తక్కువగా ఉండే వాటిని ఎంచుకోవాలి. బిస్కెట్లు తరుచుగా తినే అలవాటుంటే దాన్ని మానుకోవాలి. ఏ ఆహారం అయినా అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.












Click it and Unblock the Notifications