మజ్జిగన్నంలో పచ్చి ఉల్లిపాయ తింటున్నారా? ఇది తెలుసుకోండి

మన పూర్వీకులు పచ్చి ఉల్లిపాయను మజ్జిగ అన్నంలో, పెరుగు అన్నంలో కొరుక్కొని తినేవారు. వారి పళ్లు కూడా అంత గట్టిగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు.. ఏదైనా గట్టిగా కొరికితే పన్ను ఊడిపోయే పరిస్థితి. చాలావరకు ఉదయాన్నే చద్దన్నం తింటారు. రాత్రివేళ అన్నంలో పాలుపోసి తోడుపెట్టి దాన్ని నేరుగా ఉదయం తీసుకునేవారు. దాంతోపాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలాంటివి కలిపి తీసుకుంటారు. మజ్జిగ అన్నంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే కొన్ని సందర్భాల్లో కలిగే అనవసరమైన ప్రభావాలు కూడా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రయోజనాలు ఏమంటే..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది... ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది... ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు... ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మధుమేహం నియంత్రణ... ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

Do you eat raw onions in curd rice Know this points

అనవసరమైన ప్రభావాలు ఏమంటే
నోటి దుర్వాసన.. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. జీర్ణ సమస్యలు... కొంతమందికి ఉల్లిపాయలు జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. అలర్జీ... ఉల్లిపాయలవల్ల అలర్జీ ఉన్నవారికి తీవ్రమైన ప్రతిచర్యలు కలిగే అవకాశం ఉంది. గుండెల్లో మంట... కొన్ని సందర్భాల్లో ఉల్లిపాయలు గుండెల్లో మంటను కలిగిస్తాయి. అధికంగా ఉల్లిపాయలు తినడం వల్ల పైన పేర్కొన్న అనవసరమైన ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి శరీరం ఒకటి కాదు. ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమందికి ఉల్లిపాయలు అలర్జీని కలిగించవచ్చు. మజ్జిగ అన్నంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నప్పటికీ, అది ప్రతి ఒక్కరికీ సరిపోతుందని చెప్పలేం. మీ శరీరం తీరు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆధారపడివుంటుంది. వైద్యుల సలహా మేరకు తింటే ఇంకా మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+