మద్యం సేవిస్తే నిద్ర బాగా పడుతుందా?
చాలా మందికి మద్యం సేవించిన వెంటనే నిద్ర పట్టినట్లు అనిపిస్తుంది కానీ అది నిజమైన, నాణ్యమైన నిద్ర కాదు. వాస్తవానికి మద్యం దీర్ఘకాలంలో నిద్ర నాణ్యతను దెబ్బతీయడంతోపాటు అనేక నిద్ర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మద్యం ఒక సెడేటివ్ పదార్థం. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను నిదానపరిచి మెదడు కార్యకలాపాలను తగ్గిస్తుంది. దీనివల్ల త్వరగా నిద్రలోకి జారుకున్నట్లు అనిపిస్తుంది. ఆల్కహాల్ మెదడులో ఆల్ఫా తరంగాలను పెంచుతుంది. ఇవి సాధారణంగా విశ్రాంతి తీసుకునే సమయంలో ఉత్పత్తి అవుతాయి.
నిద్రించే చక్రానికి భంగం
నిద్రలో REM (Rapid Eye Movement), నాన్-REM (Non-Rapid Eye Movement) అనే దశలు ఉంటాయి. REM నిద్ర అనేది అత్యంత గాఢమైన, పునరుత్తేజకరమైన నిద్ర దశ. ఆల్కహాల్ REM నిద్రను తగ్గిస్తుంది. REM నిద్ర తక్కువగా ఉండటం వల్ల ఉదయం నిద్రలేచిన తర్వాత అలసిపోయినట్లు, నీరసంగా అనిపిస్తుంది.మొదట్లో త్వరగా నిద్రపట్టినప్పటికీ, ఆల్కహాల్ శరీరంలో జీర్ణమవుతున్న కొద్దీ, నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా మధ్య రాత్రిలో తరుచుగా మెలకువ వస్తుంది.

తరచుగా నిద్ర లేస్తుంటారు
ఆల్కహాల్ ఒక డైయూరిటిక్ గా పనిచేస్తుంది. ఇది మూత్రాశయం నుండి నీటిని తొలగించడాన్ని ప్రోత్సహిస్తుంది. దీంతో రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన కోసం లేవాల్సి రాడంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇలా ఆటంకం కలిగి నిద్రలేమికి దారితీస్తుంది. శరీరం ఆల్కహాల్ స్థాయిలు తగ్గినప్పుడు మెదడు మరింత చురుకుగా మారుతుంది. దీనివల్లే నిద్రలేమి కలుగుతుంది. మద్యం గొంతులోని కండరాలను సడలగొడుతుంది.
దీనివల్ల గురక ఎక్కువగా రావడం, లేదా స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఆటంకం) ఉన్నవారిలో ఆ సమస్య మరింత తీవ్రమవడం జరుగుతుంది. ఇది శ్వాసనాళాన్ని అడ్డుకోవడంతో ఆక్సిజన్ అందక నిద్రకు భంగం కలుగుతుంది. ఆల్కహాల్ గుండె స్పందన రేటును పెంచి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. తర్వాత రోజు నిద్ర లేచినా తలనొప్పి, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. దీర్ఘకాలంలో నిద్ర కోసం మద్యంపై ఆధారపడటం వల్ల గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, మధుమేహం వంటివి వస్తాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!!












Click it and Unblock the Notifications