నిద్రలేవగానే ఈ పనులు చేస్తే రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే!
చాలామంది నిద్రలేచిన వెంటనే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది నిద్రలేచిన వెంటనే బ్రష్ కూడా చేయకుండా కాఫీ, టీ తాగుతూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేచిన వెంటనే మరి కొందరు మొబైల్ ఫోను చెక్ చేసుకుంటారు. వాట్సాప్ లో మునిగిపోతారు. చాటింగ్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది ఫోన్ లోనే వార్త లోకంలో కొట్టుకుపోతారు.
ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తే డేంజర్
అయితే ఇలా ఉదయం నిద్ర లేచిన వెంటనే మొబైల్ ఫోన్ చెక్ చేసుకోవడం, ఫోన్లో మాట్లాడడం, ఫోన్లో తలపెట్టేసి చూస్తూ ఉండడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడడం మన మెదడును ఫ్రీజ్ చేస్తుందని, మన మెదడు పైన తీవ్రమైన ఒత్తిడిని పెడుతుందని, అలాగే మన కళ్ళ పైన కూడా ఒత్తిడిని పెంచుతుందని చెబుతున్నారు.

శారీరక వ్యాయామం చెయ్యకుండా ఉండొద్దు
ఇక కొంతమంది ఉదయం నిద్ర లేచిన వెంటనే నేరుగా బాత్రూం కి వెళ్తారు. అక్కడ కూడా మొబైల్ ఫోన్ పట్టుకుని కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. మరికొందరు ఉదయం నిద్ర లేచిన తర్వాత కాసేపైనా శారీరక వ్యాయామం చేయకుండా బద్దకించి కూర్చుంటారు. ఇంట్లో పనుల విషయంలోనూ శ్రద్ధ పెట్టకుండా ఆఫీసుకు వెళ్లే టైం వరకు హడావిడిగా పరిగెత్తుతారు .
ఈ పనులు చెయ్యకండి
ఈ క్రమంలో టిఫిన్ కూడా సరిగ్గా చేయకుండా వెళ్తారు. ఇలా ఉదయం పూట ఎవరు చేసినా ఆరోగ్యానికి ప్రమాదమే. నిద్రలేచిన వెంటనే కొందరు చాలా కఠినమైన వ్యాయమాలు చేస్తారు. ఇలా నిద్రలేచిన వెంటనే కఠినమైన వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కండరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైనా సరే వ్యాయామం చేసేవారు కాసేపు వార్మప్ చేసి ఆపై వ్యాయామలు చేయడం మంచిది. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాసేపు యోగా, ధ్యానం వంటివి చేస్తే కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications