సన్నగా ఉన్నామని చింతించకండి.. ఇవి తింటే చాలు వేగంగా బరువు పెరగడం ఖాయం

అధిక బరువు కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా సమతుల్యమైన, పోషకాహారంతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. బరువు పెరగడం అంటే కేవలం అధికంగా తినడం కాదు. ఇది ఆరోగ్యకరమైన పద్ధతిలో, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో జరగాలి. ఆరోగ్యకరమైన బరువు పెరగడం కోసం పౌష్టికాహారాలను చేర్చుకోవడం అవసరం. ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తే బరువు పెరగడం సులభం , ఆరోగ్యకరంగా ఉంటుంది.

1. ప్రొటీన్స్ ఆహారం
ప్రొటీన్లు బరువు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కండరాలను పెంచేందుకు మరియు శక్తిని అందించేందుకు ఉపయోగపడతాయి. ఆహారంలో గుడ్లు, మాంసం తీసుకోవడం వల్ల ప్రోటీన్‌తో పాటు , మంచి కొవ్వులను కూడా అందిస్తాయి. కండరాల పెంపునకు సహాయపడతాయి. పాలు, పెరుగు, చీజ్ లాంటి వాటిలో ప్రొటీన్లు మరియు కాల్షియం అధికంగా ఉంటాయి.

Don t worry about being thin Just eat these and you will surely gain weight fast

2. కార్బోహైడ్రేట్స్ ఆహారం
కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, బరువు పెరగడంలో సహాయపడతాయి. తెల్ల బియ్యం వేగంగా శక్తిని అందించి, బరువు పెరగడంలో ఉపకరిస్తుంది.
చపాతీలు ఆరోగ్యానికి చాలి మంచిది. గోధుమలో మినరల్స్ , ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అరటిపండ్లు, మామిడి లాంటి పండ్లు సహజమైన చక్కెరలతో బరువు పెరగడంలో సహాయపడతాయి.

3. కొవ్వుల పుష్కలత
ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగడంలో సహాయపడతాయి. బాదం, వాల్నట్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె వంటివి వంటకాల్లో ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన బరువు పెరుగుతుంది. అవోకాడో మంచి కొవ్వుల మంచి మూలం.

4. స్మూతీలు, ప్రోటీన్ షేకులు
మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లను, కాలరీలను త్వరగా అందించగల స్మూతీలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. పాలు, అరటిపండు, పండ్లతో తయారు చేసిన స్మూతీలు. ప్రొటీన్ పౌడర్‌తో కూడిన షేకులు బరువు పెరగడానికి దోహదపడతాయి.

5. స్నాక్స్
మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో పౌష్టికమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల కాలరీలు పొందవచ్చు. పీనట్ బటర్‌ను బ్రెడ్ లేదా రొట్టెలపై పూతగా వేసుకొని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
పోప్‌కార్న్, మఖానా కూడా తేలికపాటి మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

6. పానీయాలు
నీరు తగినంతగా తాగడంతో పాటు, ఆరోగ్యకరమైన పానీయాలను కూడా చేర్చుకోవాలి. పాలు, జ్యూస్, బటర్‌మిల్క్ లాంటి పానీయాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి , శక్తిని అందిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బరువు పెరగడం కోసం ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగదు. ఇవి శరీరంలో చెడు కొవ్వును పెంచుతాయి. రోజుకు ఐదు లేదా ఆరు సార్లు తక్కువ మొత్తంలో, కానీ పోషకమైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయడం ద్వారా బరువు పెరిగే కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. విటమిన్లు, మినరల్స్‌ తో కూడిన ఆహారాన్ని తినడం ద్వారా శక్తి, ఆరోగ్యం మెరుగవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+