బార్లీ Vs సగ్గుబియ్యం జావ.. రెండింటిలో ఎవరికి ఏది మంచిది..!!

బార్లీ..సగ్గుబియ్యం. వీటితో జావ చేసుకొని తాగేవారు చాలా మంది ఉన్నారు. వీటి ద్వారా ఫైబ‌ర్ తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌న‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. బార్..సగ్గుబియ్యం తీసుకోవ ద్వారా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతే కుండా గ్రీక్, బ్రిట‌న్ వంటి దేశాల్లో కైకియాన్ అనే పానీయాన్ని బార్లీ నీటితోనే త‌యారు చేస్తారు. బ్రిట‌న్ లో ఎక్కువ‌గా వేడిగా ఉండే బార్లీ నీటిని టీ లాగా తాగుతారు. అంతేకాకుండా బార్లీ నీటిలో నారింజ‌, నిమ్మర‌సం వంటివి క‌లిపి తీసుకుంటారు. అయితే, బార్లీ.. సగ్గుబియ్యం రెండింటితో వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరికి ఏది మంచిదో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

బార్లీ నీటిలో విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమిక‌ల్స్, ముఖ్య‌మైన ఖ‌నిజ ల‌వ‌ణాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం వంటి స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. బార్లీ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం అవుతుంది. బార్లీ నీరు మూత్ర‌విస‌ర్జ‌నకారిగా ప‌ని చేస్తాయి. ఈ నీటిని తీసుకోవ‌డం వల్ల మూత్రనాళాల ఇన్పెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి. అలాగే మూత్ర‌నాళాల ఇన్పెక్ష‌న్ ల‌తో బాధ‌ప‌డే వారికి ఈ నీరు స‌హ‌జ నివారిణిగా కూడా ప‌ని చేస్తాయి. పిల్ల‌లు, పెద్ద‌లు రోజూ బార్లీ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. చ‌క్క‌టి జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు కూడా బార్లీ నీరు దోహ‌ద‌ప‌డతాయి. ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. బార్లీ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

drinking-barley-water-regularly-helps-detoxify-the-body-by-flushing-out-toxins

కొలెస్ట్రాల్, ట్రైగ్లిజ‌రాయిడ్స్ కూడా అదుపులో ఉంటాయి. క‌నుక గుండె ఆరోగ్యం మెరుగుప‌డు ది. ఇలా అనేక ర‌కాలుగా బార్లీ నీరు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక, సగ్గుబియ్యం జావ శరీరానికి తక్షణ శక్తినిస్తుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది గ్లూటెన్ పడనివారికి మంచిది మరియు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొవ్వు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో.. ఈ రెండిటి ద్వారా పరిమితంగా వాడుకుంటే ఆరోగ్య పరంగా ప్రయోజనాలు అందుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+