ఇకపై వర్క్ స్పేస్ లతో ..హైదరాబాద్ మెట్రో నయా ప్లాన్!

హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఆదాయం కోసం కొత్త ప్లాన్ చేసింది. ఇదే సమయంలో నగర జీవన విధానంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్లను సాధారణ ప్రయాణ కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ఆధునిక వర్క్‌స్పేస్‌లుగా మార్చే దిశగా ముందుకు వెళ్తోంది.

57 మెట్రో స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్

ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ (TOD) వ్యూహంలో భాగంగా ఎల్‌బీ నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లలోని 57 మెట్రో స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇవి ఐటీ కంపెనీలు మరియు ఇతర సంస్థలకు సురక్షితమైన రిమోట్ కో-వర్కింగ్ స్పేస్‌లుగా పని చేస్తాయి. ఈ కొత్త మోడల్ ద్వారా ఉద్యోగులు తమ ఇంటికి సమీపంలోని మెట్రో స్టేషన్ వద్దే పని చేయవచ్చు.

Hyderabad Metro Rail introduces innovative Office Bubbles as secure co-working spaces at 57 stations across three corridors

జేబీఎస్ మెట్రో స్టేషన్‌లో కో వర్కింగ్ సెంటర్లు

దీని వల్ల రోజువారీ దీర్ఘ ప్రయాణాలు, ట్రాఫిక్ జామ్‌లు, పెట్రోల్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అలాగే ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం పెరిగి నగర రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. జేబీఎస్ మెట్రో స్టేషన్‌లో ఇప్పటికే కోహోర్ట్ కో-వర్కింగ్ సెంటర్ విజయవంతంగా నడుస్తోంది. అదే స్టేషన్‌లో గోల్డెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తన ఆఫీసును ఏర్పాటు చేసుకుంది.

వర్కింగ్ కు కావాల్సిన అన్ని సదుపాయాలతో మెట్రో స్టేషన్లు

ఈ విజయాలు మిగిలిన స్టేషన్లలో కూడా ఇలాంటి సౌకర్యాలు అందించడానికి ప్రేరణనిస్తున్నాయి. ఈ స్పేస్‌లు ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలతో అందుబాటులో ఉంటాయి. నిరంతరం విద్యుత్ సరఫరా, అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థ, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రీమియం వర్క్ ఎన్విరాన్‌మెంట్ వంటి సౌకర్యాలు ఉంటాయి. సాధారణ ఆఫీసులతో పోలిస్తే రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. అయితే ఏవైనా నిర్మాణ మార్పులు చేయాలనుకుంటే మెట్రో అధికారుల అనుమతి తప్పనిసరి.

ఉద్యోగుల నుండి ఈ ఆలోచనకు మంచి స్పందన

ఉద్యోగుల నుంచి ఈ ఆలోచనకు మంచి స్పందన వస్తోంది. రోజూ గంటల తరబడి ప్రయాణం చేసే బదులు సమీప స్టేషన్ వద్దే పని చేయడం వల్ల వ్యక్తిగత సమయం, ఆరోగ్యం మెరుగుపడతాయని చెబుతున్నారు. అయితే ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వారికి పార్కింగ్ సమస్య ఒక సవాలుగా మారవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు.. హెచ్చరిస్తున్న వరుణుడు!
నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు.. హెచ్చరిస్తున్న వరుణుడు!

హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా మార్చే కీలక ప్రాజెక్ట్

హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని స్టేషన్లను ఇలాంటి వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చేసే యోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ ఐటీ రంగం ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా, మెట్రో కు ఆదాయంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+