కాఫీ తాగితే షుగరు అదుపులో ఉంటుందా?
రక్తంలో కెఫీన్ మోతాదుకు మించివుంటే టైప్2 మధుమేహం ముప్పు తక్కువగా ఉంటుంది. ఇటీవలే యూరప్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. కెఫీన్ బరువు తగ్గించడంద్వారా షుగరును తగ్గిస్తోంది. కెఫీన్ జీవక్రియ తక్కువగా ఉన్నవారిలో ఇది విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతోందని, దీనివల్లే రక్తంలో మోతాదు ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
కెఫీన్ వాడకానికీ, బరువు తగ్గటానికీ మధ్య సంబంధం ఉంటుంది. అందుకే బరువు తగ్గించే మాత్రల్లో విధిగా కెఫీన్‌ను కూడా యాడ్ చేస్తుంటారు. ఇది శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేసుకునేలా చేసి బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. బరువు తగ్గితే షుగరు, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు నుంచి బయటపడవచ్చు. కాఫీ ఎక్కువగా తాగటం ద్వారా మధుమేహాన్ని తగ్గించుకోవచ్చనేది అపోహే అని, ఈ అధ్యయనం కెఫీన్ వినియోగానికి బదులు కెఫీన్ మోతాదు గురించే చెబుతోందని గుర్తించాలి. పైగా ఇవి రెండూ జన్యువులతో ముడిపడి ఉంటాయి.

ఈ జన్యువులున్నవారిలో కెఫీన్ జీవక్రియ నెమ్మదిగా సాగుతుంది. తక్కువ కాఫీ తీసుకున్నా రక్తంలో కెఫీన్ మోతాదు ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గటానికి తోడ్పడుతోందని.. ఫలితంగా షుగరు ముప్పు 43% వరకు తక్కువగా ఉంటోందని చెబుతున్నారు. కెఫీన్ జీవక్రియ నెమ్మదిగా సాగే స్వభావం ఉన్నవారు తక్కువ కెఫీన్ తీసుకున్నా ప్రయోజనం ఎక్కువగా ఉంటోంది.
అంతే తప్ప కాఫీ ఎక్కువగా తాగితే ప్రయోజనం ఉంటుందని అధ్యయనం సూచించడంలేదనే విషయాన్ని గమనించాలి. కాఫీ ఎక్కువగా తాగితే గుండె వేగం పెరగటం, ఆందోళన, చిరాకు, చేతుల వణుకు, నిద్రలేమి, తలనొప్పి లాంటి అదనపు సమస్యలకు దారితీస్తుంది. కాఫీతో పాటు పంచదార కూడా తీసుకోవటం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది












Click it and Unblock the Notifications