Tea Side Effects: చాయ్ అదే పనిగా తాగుతున్నారా.. అయితే ఈ కష్టాలు తప్పవు..!

పూర్వం మనం దేశంలో చాయ్ తాగే అలవాటు లేదు. కానీ బ్రిటిష్ వాళ్లు పోతూ పోతూ మనకు చాయ్ అలవాటు చేసి వెళ్లిపోయారు. ఇలా చాయ్ అలవాటు పడిన మనం.. చాయ్ లేకుండా ఉండలేకపోతున్నాం. చాలా మందికి ఉదయం లేవగానే చాయ్ తాగకుండా ఉండలేరు. కొందరైతే రోజుకు రెండు నుంచి మూడసార్లు చాయ్ తాగుతుంటారు. భారత్ దాదాపు 64 శాతం మంది రెగ్యులర్ గా చాయ్ తాగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

చాయ్ రకాలు

చాయ్ రకాలు


అయితే ఈ చాయ్ లో చాలా రకాలే ఉన్నాయి. అల్లం టీ, బాదం టీ, బ్లాక్ టీ, మసాలా టీ, ఇరానీ చాయ్, ఇలాచి చాయ్ ఉన్నాయి. నీళ్లు, టీ ఆకులు, చక్కెర, పాలు, అల్లం, ఇతర మసాలు దినుసులతో నచ్చినట్టుగా టీని తయారుచేసుకుని తాగుతుంటారు. ఈ చాయ్ ఆరోగ్యానికి మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు.

కెఫిన్

కెఫిన్

చాయ్ రోజుకు ఒక్కసారి తాగితే ఫర్వాలేదు. కానీ రోజుకు రెండు మూడుసార్లు తాగితే ఆరోగ్యానికి మంచి కాదట. చాయ్ లో ఉంటే కెఫిన్ కంటెంట్ ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే నిద్రసమస్యలకు దారితీస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు మీ శరీర బరువును పెంచుతాయి. జీవక్రియ సిండ్రోమ్ బారిన పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయట.

డయాబెటీస్

డయాబెటీస్


ఒకవేళ మీకు డయాబెటీస్ ఉన్నా.. ప్రీ డయాబెటీస్ ఉన్నా, బరువును తగ్గించుకోవాలనుకున్నా.. టీని తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎసిడిటీ, మలబద్దకంతో బాధపడుతుంటే కూడా టీకి దూరంగా ఉంటే మంచిది. టీ ఆకులలో కెఫీన్ అనేది ఒక సేంద్రీయ భాగం. టీ ఎక్కువగా తాగడం వల్ల మనం అధిక మొత్తంలో కెఫిన్‌ను తీసుకున్నట్లవుతుంది. ఫలితంగా మనలో భయం, ఆందోళన, చంచలత వంటి భావాలు తీవ్రతరం అవుతాయి.

థియోఫిలిన్

థియోఫిలిన్

టీలో ఉండే థియోఫిలిన్ అనే పదార్ధం మన శరీరంలోని జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య ఎదురవుతుంది. టీలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరు ఎంత టీ తాగితే, మీ కడుపులో అంత ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గుండెల్లో మంట ఏర్పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+