health tips:కొవిడ్ తగ్గినా వాసన రావడంలేదా?
కొవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత కూడా కొందరికి వాసన పూర్తిగా తిరిగి రావడంలేదు. ముక్కులో వాసనను పసిగట్టే నాడీ కణాల మీద వ్యాధినిరోధక శక్తి పదే పదే దాడి చేస్తోంది. దీనివల్లే ఆ నాడీ కణాల సంఖ్య పడిపోవటం దీనికి కారణమని డ్యూక్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో అధ్యయనంలో బయటపడింది. కొవిడ్-19 కారక వైరస్ అదేపనిగా దాడి చేయటం వల్ల వాసనలను పసిగట్టే భాగం తీవ్రంగా దెబ్బ తింటోందని, ఇది కోలుకోవటానికి చాలా ఎక్కువ సమయం పడుతోందని గుర్తించారు.
షుగరు వ్యాధికి వైద్యులు ముందుగా సూచించేది.. ఆహారం, వ్యాయామం. ఈ రెండింటితోపాటు మెట్‌ఫార్మిన్ మందు సూచిస్తారు. అప్పటికీ రక్తంలో గ్లూకోజు లెవల్స్ తగ్గకపోతే రెండో మందును జోడిస్తారు. అదనంగా చేర్చే మందుల్లో ఏది మంచిది? ఏది బాగా పనిచేస్తుంది? అనే విషయంపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. మెట్‌ఫార్మిన్‌తో పాటు లిరాగ్లుటైడ్, గ్లిమిపిరైడ్, సిటాగ్లుటైడ్, ఇన్సులిన్ గ్లార్గైన్ యూ-100 మందులో ఒకదాన్నిచ్చి 5 సంవత్సరాలపాటు పరిశీలించారు. ఈ మందులన్నీ రక్తంలో గ్లూకోజు లెవల్స్ తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తేలింది.

మిగతా మందులతో పోలిస్తే లిరాగ్లుటైడ్, ఇన్సులిన్ గ్లార్గైన్ ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. అధ్యయనం ముగిసేసమయానికి నాలుగింట మూడొంతుల మందిలో గ్లూకోజు లెవల్స్ నిర్ణీత స్థాయికి చేరకపోవటం గమనార్హం. గుండెజబ్బు, ఇతర సమస్యలున్నవారి రక్తంలో గ్లూకోజు, కొన్ని సమస్యల విషయంలో మందులు చూపించే ప్రభావంలో కూడా తేడాలున్నాయి. లిరాగ్లుటైడ్ లేదా ఇన్సులిన్ గ్లార్గైన్ వాడినవారిలో గ్లూకోజు లెవల్స్ ఎక్కువ కాలం నిర్ణీత లక్ష్యాలకు చేరుకుంటున్నాయి. కానీ లిరాగ్లుటైడ్ వాడినవారికి జీర్ణ సమస్యలు తలెత్తాయి. షుగరును నియంత్రించడానికి ఆయా వ్యక్తులకు అనుగుణంగా మందుల ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications