Salt: పండ్లపై ఉప్పు జల్లుకుని తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!
పండ్లపై ఉప్పు జల్లుకుని తినడం వల్ల శరీరం సోడియం పెరిగి సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మందులు వేసుకోవడంతో పాటు పండ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. ఎందుకంటే పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి. అయితే కొంత మంది పండ్లు తినేటప్పుడు వాటిని కోసి ముక్కలపై ఉప్పు చల్లుకుని తింటారు. మామిడి కాయ, జామ కాయ ఇలా ఎక్కువగా తింటారు. అలా తింటే రుచి కూడా బాగుటుంది. కానీ ఇలా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

5 గ్రాముల ఉప్పు
మనం ఆహారం తీసుకునేటప్పుడే అందులో ఉప్పు వేసుకుంటా. అదనంగా పండ్ల ముక్కలపై ఉప్పు చల్లుకుని తినడమంటే ఉప్పు ఎక్కువే తీసుకోవడమే అని వివరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అతిగా ఉప్పు తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పండ్లపైన ఉప్పు వేసుకుని తినడం వల్ల గుండెపోటు, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయట.

రక్తపోటు
పండ్లపై ఉప్పు జల్లుకుని తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగి.. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. గుండెపోటు, స్ట్రోక్, గుండెకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉప్పును ఎక్కువగా తినడం మూత్రపిండాల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాల పనితీరు సరిగ్గా ఉండదని చెబుతున్నారు.

మూత్రపిండాలు
అందుకే మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు పండ్లను ఎక్కువగా తింటుంటారు. ఈ పండ్లకు ఉప్పును కలిపితే తింటే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధి ఉంటే మీరు తినే ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు.

సోడియం కంటెంట్
శరీరంలో సోడియం కంటెంట్ ఎక్కువైతే.. మీ బాడీలో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కడుపులో ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది. సోడియం కంటెంట్ ఎక్కువైతే మన బాడీ నిర్విషీకరణ చేయబడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి.

పోషకాలు
పండ్లపై ఉప్పును జల్లుకుని తినడం వల్ల మన శరీరానికి పండ్ల నుంచి పూర్తి పోషకాలు అందవు. ఎందుకంటే ఉప్పును జల్లడం వల్ల పండ్ల నుంచి నీరంతా బయటకు పోతుంది. అలాగే పోషకాలు కూడా తగ్గుతాయి. ఉప్పును ఎక్కువగా ఎక్కువగా తింటే శరీరంలో పోషకాలు సరిగా గ్రహించలేరు. కాబట్టి పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం మానుకోవాలి. అంతేకాకుండా దీని వల్ల మూత్రంలో సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications