బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తింటున్నారా? ఇది దంతాలను దెబ్బతీస్తుందా?

బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తినడం సాంప్రదాయంగా చాలా మందికి అనవాయితీ. అయితే దంతాలు తోమకున్న వెంటనే ఆహారం తీసుకోవడం సరైనదేనా? తింటే ఏమవుతుంది.ఇది తరచుగా మనం ఎదుర్కొనే ప్రశ్న. దీనిపై వైజ్ఞానిక అభిప్రాయం ,ఆరోగ్య దృష్టిలో కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దంత నిపుణుల అభిప్రాయం ప్రకారం, టిఫిన్ తినడానికి ముందు బ్రష్ చేయడం మంచి అలవాటు. ఇది నోటి శుభ్రతను మెరుగుపరుస్తుంది, అయితే టిఫిన్ తినడంలో కొంత విరామం పెట్టడం మంచిది.

దంతాలను తోముకోవడం ఎందుకు ముఖ్యం?

ప్లాక్ తొలగించడం: దంతాలపై పేరుకుపోయే ఆహారపు అవశేషాలు, బ్యాక్టీరియా కలిసి ప్లాక్ అనే పొరను ఏర్పరుస్తాయి. ఈ ప్లాక్ దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసి, క్యావిటీలకు కారణమవుతుంది. బ్రష్ చేయడం ద్వారా ఈ ప్లాక్‌ను తొలగించి, దంతాలను రక్షిస్తాయి. బ్యాక్టీరియా ప్లాక్‌లో పెరిగి, దంత క్షయం, చిగుళ్ల వ్యాధులకు కారణమవుతాయి. కనుక బ్రష్ చేయడం ద్వారా ఈ బ్యాక్టీరియాను తొలగించి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము.

Eating tiffin immediately after brushing Does this damage your teeth

బ్రష్ చేసిన వెంటనే ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలు:

ఎనామెల్ ఎరోషన్: దంతాల ఎనామెల్ ఒక రకమైన మినరల్. బ్రష్ చేసిన వెంటనే ఆహారం తీసుకుంటే, ఎనామెల్ సున్నితంగా మారి, ఆహారంలోని ఆమ్లాలు దానిని దెబ్బతీస్తాయి. దీని వల్ల దంతాలు పసుపు రంగులోకి మారి, సున్నితంగా మారతాయి. బ్రష్ చేసిన తర్వాత వెంటనే ఆహారం తీసుకుంటే, మళ్ళీ ప్లాక్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బ్రష్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం తగ్గిపోతుంది. ఎనామెల్ దెబ్బతినడం వల్ల దంతాలు చల్లని, వేడి ఆహారాలకు సున్నితంగా మారతాయి.

జీర్ణవ్యవస్థపై ప్రభావం:
బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తింటే నోటిలో సలైవా ఉత్పత్తి తగ్గి జీర్ణక్రియ కొంత నెమ్మదిగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, టిఫిన్‌లో ఉన్న కార్బోహైడ్రేట్లు సంపూర్ణంగా జీర్ణం కావడానికి సమయంపడుతుంది. అటు టూత్‌పేస్ట్‌లో ఉండే పదార్థాలు, ముఖ్యంగా ఫ్లోరైడ్, నోటి రుచిని తాత్కాలికంగా మార్చుతాయి. ఇది టిఫిన్‌లోని రుచులను ఆస్వాదించకుండా చేస్తుంది.

బ్రష్ తర్వాత నోట్లో pH స్థాయి:
బ్రష్ చేసిన వెంటనే నోట్లోని pH స్థాయి ఆల్కలైన్‌గా మారుతుంది. ఇది కొంతకాలం వరకు ఆహారాన్ని జీర్ణించడంలో అవరోధం కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఆహారం తినడం కొద్దిగా ఆలస్యం చేస్తే మంచిది. బ్రష్ చేసిన వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత టిఫిన్ వంటి ఆహారాలు తినడం ఉత్తమం. ఈ సమయం గరిష్టమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. శక్తిని అందిస్తుంది.

సరైన అలవాట్లు:
బ్రష్ చేసిన తర్వాత సాదారణ నీటితో నోటిని శుభ్రం చేయండి. తర్వాత తగిన విరామం ఇచ్చి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. టిఫిన్ తర్వాత మళ్లీ బ్రష్ చేయకపోయినా, నోటి శుభ్రత కోసం గార్గిల్ చేయడం ఉత్తమం. బ్రష్ చేసిన వెంటనే పుల్లటి పండ్లు, జ్యూస్‌లు, సోడా వంటి ఆమ్లత్వం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు. అయితే, ఒకవేళ మీరు బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తినక తప్పకపోతే, కనీసం 30 నిమిషాల తర్వాత తినడం మంచిది.

గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా దంత సమస్య ఉంటే, తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+