బిస్కెట్లు అధికంగా తింటున్నారా? అయితే ఇవి మీ హెల్త్‌ని ఎంత డ్యామేజ్ చేస్తాయో తెలుసా?

బిస్కెట్లు రోజువారీ జీవితంలో చాలా మంది అలవాటు చేసిన స్నాక్స్‌లో ఒకటి. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం అనారోగ్యకరమైన అనేక ప్రభావాలను కలిగిస్తుంది. బిస్కెట్లు తినడం వల్ల ఆకర్షణీయమైన రుచితో పాటు తక్షణ శక్తిని అందించినా, దీర్ఘకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అందులో ముఖ్యంగా చక్కెరలు, ట్రాన్స్ ఫ్యాట్, ప్రిజర్వేటివ్స్, మరియు మిగతా ప్రాసెస్డ్ పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

బిస్కెట్లు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
చాలా రకాల బిస్కెట్లలో కేలరీలు, చక్కెర మరియు కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రోజువారి కేలరీల సేవనాన్ని పెంచి బరువు పెరగడానికి దారితీస్తాయి. బిస్కెట్లలో చక్కెర అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, చక్కెర వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటిల్లో ఉండే అధిక కొవ్వు , సోడియం హృదయ సంబంధ సమస్యలకు దారితీయవచ్చు. అంతే కాకుండా కొన్ని రకాల బిస్కెట్లు జీర్ణం కావడానికి కష్టంగా ఉంటాయి. ఇవి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతాయి. బిస్కెట్లలో ఫైబర్, విటమిన్లు , ఖనిజాలు తక్కువగా ఉంటాయి.కనుక అధికంగా బిస్కెట్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు లభించక పోవడం వల్ల పోషకలోపం ఏర్పడవచ్చు. బిస్కెట్లలో ఉండే చక్కెర దంతాలపై ప్లాక్ ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది దంతాలు క్షీణించడానికి దారితీస్తుంది.

Eating too many biscuits But do you know the side effects on your health

ఏ రకమైన బిస్కెట్లు తినాలి?:
హోల్ గ్రెయిన్ బిస్కెట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. షుగర్ ఫ్రీ బిస్కెట్లలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా నిరోధిస్తాయి. బిస్కెట్లను తినడం మానుకోవడం అసాధ్యమే అయినా, వాటిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల బిస్కెట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించవచ్చు. పిల్లలకు బిస్కెట్లను తక్కువ మొత్తంలో ఇవ్వాలి. హోం మేడ్ బిస్కెట్లను తయారు చేసి తినడం మంచిది.

మొత్తానికి బిస్కెట్లు రుచికరమైనవి అయినప్పటికీ, అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, బిస్కెట్లను మితంగా తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా బిస్కెట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+