చలికాలంలో గుడ్లు తింటున్నారా..ఇది తెలుసుకోవాల్సిందే..!!

గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్లు, ఖలిజలవణాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి, శరీరాన్ని పుష్టిగా ఉంచేలా చేస్తాయి. గుడ్డులో ప్రోటీన్ ఉంది, కానీ దాని ఒమేగా 3 మెదడుకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది దానిని అల్పాహారంలో తినడానికే ఇష్టపడతారు. అయితే, సాయంత్రం పూట కూడా దీన్ని తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, చలికాలంలో కోడిగుడ్లు తీసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

కోడిగుడ్డు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తుంది. అనేక వ్యాధుల బారి నుండి కాపాడడానికి ఉపయోగపడతాయి. అయితే కోడిగుడ్లను తినే విషయంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని పరిమితి లేకుండా తినటం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి ఏడు నుంచి పది గుడ్లు తీసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. వ్యాయామం చేసేవారు, అథ్లెట్ లు రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చంటే ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు ఒక పూర్తి గుడ్డును తీసుకోవచ్చని సూచిస్తున్నారు. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఆహారంలో గుడ్డును తీసుకోవాలంటే వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. వారు వారానికి రెండు లేదా మూడు గుడ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం రాదని చెబుతున్నారు. ఇక అధిక రక్తపోటు ఉన్నవారు గుడ్లను ఆహారంలో భాగంగా చేసుకోకపోతేనే మంచిదని చెబుతూనే కొన్ని సూచనలు చేస్తున్నారు.

eating-two-eggs-daily-in-winter-prevents-vitamin-d-and-b12-deficiency

బీపీ ఉన్నవారు తెల్ల సొన మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. మొత్తంగా కోడిగుడ్డు మంచి పోషకాహారమే అయినప్పటికీ దీని అధిక వినియోగం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అనేక వ్యాధులు ఉన్నవారికి ఎక్కువ గుడ్లు తినటం అసలే మంచిది కాదని చెప్తున్నారు. ఇక, చలి కాలంలో శరీరానికి డీ విటమిన్ కోసం చాలా మంది గుడ్లను ఎక్కువగా వినియోగిస్తారు. శరీరానికి రోజువారీ అవసరమైన విటమిన్ డి పరిమాణం వయస్సుపై ఆధారపడి ఉంటుందని నేషనల్ హెల్త్ లైబ్రరీ తెలిపింది. మీరు 14 - 18 సంవత్సరాల మధ్య ఉంటే, మీకు రోజుకు 15 మైక్రోగ్రాముల విటమిన్ డి అవసరం. మీ రోజువారీ విటమిన్ డి అవసరాన్ని తీర్చడానికి ఒక గుడ్డు సరిపోతుంది. అందువల్ల, మీ వయస్సు ఆధారంగా రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసుకుని, వాటిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యుక్త వయసులో ఉన్నవారికి గుడ్లు కొంత మేర ఎక్కువగా తీసుకున్నా నష్టం ఉండదని... షుగరు, బీపీ ఉన్న వారు మాత్రం వైద్యుల సూచనల మేరకు మాత్రమే చలికాలంలో గుడ్లను వినియోగించటం మంచిదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+