కేరళ స్టైల్ "కోడిగుడ్డు" కూర టేస్టే వెరబ్బా.. 'ముట్టా కర్రీ' ఎలా చేయాలంటే ?

గుడ్డు అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యానికి మేలు చేయడమే.. కాకుండా ఎక్కువగా ఇష్టపడే ఆహారంగా గుర్తింపు పొందింది. అత్యంత పోషక విలువలతో కూడిన సంపూర్ణ ఆహారంగా కూడా గుడ్డు పరిగణించబడుతుంది. దీని వల్ల ప్రోటీన్, విటమిన్ A, D, E, B12, ఫోలేట్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుతాయి. గుడ్డు తినడం వల్ల శక్తి పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

అంతే కాకుండా భారతదేశంలో గుడ్డుతో చేసే వంటకాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఒమ్లెట్, బాయిల్డ్ ఎగ్, స్క్రాంబుల్ లేదా బిర్యానీలా ఎన్నో రకాల వంటకాలు ఉన్నా.. అత్యంత ప్రాచుర్యం పొందినది మాత్రం గుడ్డు కర్రీ. ప్రతి రాష్ట్రంలో గుడ్డు కర్రీని రకరకాలుగా చేస్తుంటారు. దక్షిణ భారత వంటల్లో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో గుడ్డు కర్రీలో మసాలాలు, కొబ్బరి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

egg-curry-in-kerala-style-as-mutta-curry-telugu-recipe

కేరళలో కొబ్బరి పాలు వాడి చేసే "ముట్టా కర్రీ"కి ప్రత్యేక రుచి ఉంటుంది. కొబ్బరి పాలు వల్ల వంటకానికి ఒక ప్రత్యేక సువాసన, మృదువైన టెక్స్చర్, ఘుమఘుమలాడే రుచి వస్తుంది. ఈ కర్రీని అన్నం, ఆప్పం, ఇడియప్పం లేదా గోధుమ పరోటాతో తింటే అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇంట్లో సులభంగా చేసుకునే ఈ వంటకం రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

ముట్టా కర్రీకి కావలసిన పదార్థాలు..

  • ఉడికించిన గుడ్లు - 4 నుండి 6
  • తరిగిన ఉల్లిపాయలు - 2
  • తరిగిన టమాటా - 1
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా
  • చీల్చిన పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - ఒక రెబ్బ
  • పసుపు - ¼ చెంచా
  • కారం పొడి - 1 చెంచా
  • ధనియాల పొడి - 1½ చెంచా
  • నల్ల మిరియాల పొడి - ¼ చెంచా
  • గరం మసాలా - ½ చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చిక్కని కొబ్బరి పాలు - 1 కప్పు
  • నీరు - ½ కప్పు
  • ఆవాలు - ½ చెంచా
  • కొబ్బరి నూనె - 2 చెంచాలు

తయారీ విధానం..

  • ముందుగా గుడ్లు ఉడికించాలి. ఉడికిన తర్వాత పొట్టు తీసి, గుడ్లపై చిన్న గాట్లు పెట్టాలి. ఇలా చేస్తే మసాలా రుచి గుడ్లలోకి బాగా వెళ్తుంది.
  • ఒక పాన్‌లో కొబ్బరి నూనె వేడి చేయాలి. ఆవాలు వేసి చిటపటలాడిన వెంటనే, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తే వంటకానికి మంచి సువాసన వస్తుంది.
  • ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి.
  • తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేపాలి. ఆ వెంటనే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • కొద్ది సేపటి తర్వాత ఉడికించిన గుడ్లు వేసి మసాలాతో మెల్లగా కలపాలి. గుడ్లపై మసాలా పూరీగా పట్టేలా చూడాలి.
  • తర్వాత చిక్కని కొబ్బరి పాలు, ½ కప్పు నీరు పోసి కలపాలి. చిన్న మంటపై సుమారు 5-7 నిమిషాలు మరిగించాలి.
  • చివరగా గ్రేవీ చిక్కబడినప్పుడు, నూనె పైకి తేలుతుంది. ఆ సమయంలో గరం మసాలా, కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి కలిపి దించేయాలి.

ఇక ఇప్పుడు రుచికరమైన కేరళ స్టైల్ ముట్టా కర్రీ మీకోసం సిద్దంగా ఉంటుంది.

వంట చిట్కాలు..

అయితే కొబ్బరి పాలు ఎక్కువగా మరిగిస్తే వేరుపడతాయి, కాబట్టి చిన్న మంటపై ఉంచాలి.

మసాలా వేస్తున్నప్పుడు కొద్దిగా చక్కెర లేదా జాగ్రీ (గుడ్డు వంటల్లో కేరళ స్టైల్లో చేస్తారు) వేసితే రుచి పెరుగుతుంది.

ఎక్కువ మసాలా రుచి ఇష్టపడేవారు చివర్లో కొద్దిగా మిరియాల పొడి చల్లి సర్వ్ చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+